Nagarjuna and Allu Arjun : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకొని ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి సందర్భంలోనే చాలామంది స్టార్ హీరోలు పాన్ ఇండియా హీరోలుగా ఎదుగుతూ వాళ్ళకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు…మరి ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో నెంబర్ వన్ పొజిషన్ కి చేరుకోవడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకుంటూ తనకంటూ ఒక ఐడెంటిటిని ఏర్పాటు చేసుకున్న నటుడు అల్లు అర్జున్… ఇప్పుడు ఆయనకు సంబంధించిన కేసు విషయంలో ఆయన నానా తంటాలు పడుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఏది ఏమైనా కూడా ఈ కేసులో తప్పు ఎవరిది అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక ఇదిలా ఉంటే ఏది ఏమైనా కూడా రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో నాగార్జున ‘ఎన్ కన్వెన్షన్’ హాల్ ను కూలగొట్టాడు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ మీద కేసులు పెట్టి అతన్ని జైలుకు పంపించే ప్రయత్నమైతే జరుగుతుంది అంటూ కొంతమంది సినిమా మేధావులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఇలాంటి ఒక సీఎం తెలంగాణలో ఉండడం వల్ల సినిమా వాళ్లకి చాలా రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి ఇలాంటి ఇబ్బందులను దాటుకొని మనం తెలుగు సినిమా ఇండస్ట్రీని ఆంధ్రకు షిఫ్ట్ చేద్దామా అనే ధోరణిలో కొంతమంది సినిమా నిర్మాతలు ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది…ఇక ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం అక్కడ డిప్యూటీ సీఎం గా ఉన్నాడు. కాబట్టి వాళ్లకు కావాల్సిన అన్ని సౌకర్యాలను తను సమకూర్చే విధంగా ఉండడంతో కొంతమంది ఇప్పటివరకు అయితే ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి తెలంగాణ నుంచి సినిమా ఇండస్ట్రీ ఆంద్రా కి వెళితే ఎవరికి నష్టం జరగవచ్చు.
తెలంగాణలో సినిమా ఇండస్ట్రీ ఇక ఉండదా అనే ధోరణిలో కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. నిజానికి తెలంగాణ నుంచి సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకి వెళ్లిపోవడం జరిగితే తెలంగాణలో ఉన్న చాలా మంది దర్శకులు హీరోలు అప్ కమింగ్ హీరోలుగా రాణించాలనుకుంటున్న వాళ్ళకి సైతం ఇక్కడ మంచి అవకాశాలు వస్తాయి. వాళ్ళు కూడా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.
ఒకవేళ హీరోలందరూ ఆంధ్రాకి వెళ్ళిపోయినా కూడా తెలంగాణకే అది చాలా వరకు మేలు జరుగుతుందని ఇక్కడ హీరోలకు అవకాశాలు వస్తాయని చాలామంది సినిమా పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…
ఇక ఇప్పుడే ఆంధ్ర కి వెళ్ళిపోతే అక్కడ కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం వల్ల సినిమా ఇండస్ట్రీని నడిపించడం కష్టమవుతుంది. కాబట్టి సినిమా ఇండస్ట్రీ అక్కడికి షిఫ్ట్ చేద్దామనే ఆలోచన ఉన్న కూడా దానికి ఇంకా సమయం పట్టే అవకాశాలైతే ఉన్నాయి…