
Lavanya Tripati – VarunTej : లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్ ఎఫైర్ లో ఉన్నారంటూ చాలా కాలంగా వినిపిస్తుంది. ఆ మధ్య ఈ ప్రచారం గట్టిగా జరిగింది. దీనికి కొన్ని ఆధారాలు చూపుతూ లావణ్య-వరుణ్ డేటింగ్ చేస్తున్నాని వార్తలు వెలువడ్డాయి. ఒక దశలో అయితే… వరుణ్ తేజ్ నేరుగా లావణ్యను కలిసేందుకు బెంగుళూరు వెళ్లారని. ఆమె కోసం రింగ్ కొన్నాడని. మ్యారేజ్ ప్రపోజల్ పెట్టి అధికారిక ప్రకటన చేయనున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. అయితే అలాంటిదేమీ జరగలేదు. తర్వాత ఒకటి రెండు సందర్భాల్లో లావణ్య త్రిపాఠి దీన్ని ఖండించారు.
వరుణ్ తేజ్ నాకు మంచి ఫ్రెండ్. అంతకు మించి ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. అయితే ఇటీవల ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆమె నటించిన వెబ్ సిరీస్ పులి మేక జీ 5లో రిలీజ్ చేశారు. పులి మేక సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా యూనిట్ సభ్యులు ‘సుమ అడ్డా’ టాక్ షోలో పాల్గొన్నారు. ఈ షోలో యాంకర్ సుమ లావణ్యను ఇరుకున పెట్టింది.

లావణ్యను ఆమె ఓ క్రేజీ క్వశ్చన్ అడిగారు. నాని, వరుణ్ తేజ్ లలో ఎవరు హ్యాండ్సమ్ గా ఉంటారో చెప్పాలంది. దానికి లావణ్య తడుముకోకుండా… వరుణ్ తేజ్ అని సమాధానం చెప్పింది. దాంతో ఆ షో యాంకర్ సుమతో పాటు పులి మేక యూనిట్ సభ్యులు నవ్వుకున్నారు. స్క్రీన్ మీద వరుణ్ ఫోటో వేయడంతో లావణ్య కూడా నవ్వేసింది. వరుణ్ తేజ్ తో ఆమెకు ఎఫైర్ ఉందని వార్తలు వస్తున్న క్రమంలో… వరుణ్ తేజ్ అందగాడని లావణ్య చెప్పడంతో అందరూ నవ్వేశారు.
పరోక్షంగా లావణ్య వరుణ్ మీద ప్రేమను ఇలా భయటపెట్టిందని కొందరు అభిప్రాయపడ్డారు. హీరో నానితో లావణ్య భలే భలే మగాడివోయ్ చిత్రం చేశారు. ఇది సూపర్ హిట్. వరుణ్ కి జంటగా మిస్టర్ మాత్రం నిరాశపరిచింది. ఇక లావణ్య కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. వరుస ప్లాప్స్ లో ఆమె రేసులో వెనుకబడ్డారు. ప్రస్తుతం లావణ్య తమిళంలో ఓ చిత్రం చేస్తున్నారు. తెలుగు చిత్రానికి సైన్ చేసిన దాఖలాలు లేవు.