Tollywood Heroes: వైసీపీ, టీడీపీ, జనసేన… ఏ హీరోకి ఏ పార్టీ అంటే ఇష్టమో తెలుసా!

మెగా హీరోలందరూ జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నారు. కుర్ర హీరోలైన సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, చరణ్ ఈ విషయాన్ని స్పష్టం చేశాడు.

Written By: Shiva, Updated On : October 15, 2023 6:43 pm

Tollywood Heroes

Follow us on

Tollywood Heroes: ఏపీ రాజకీయాలతో టాలీవుడ్ కి విడదీయరాని సంబంధం ఉంది. పరిశ్రమ తెలంగాణాలో ఉన్నప్పటికీ ఏపీ మీదే చిత్ర పరిశ్రమ నజర్ ఉంటుంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. తెలంగాణా కంటే ఏపీ అతిపెద్ద మార్కెట్ ఉన్న రాష్ట్రం. 60% శాతానికి పైగా వసూళ్లు అక్కడ నుండే రావాలి. ఇక టాలీవుడ్ టాప్ స్టార్స్, బడా కుటుంబాలన్నీ ఏపీకి చెందివారే. అలాగే టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ సీఎం కూడా అయ్యారు. రాజకీయాల్లో కీలకంగా ఉన్న కొన్ని సామాజిక వర్గాలు టాలీవుడ్ లో బలంగా పాతుకుపోయాయి.

అయితే ఏ హీరో ఏ పార్టీకి చెందినవాడు? మద్దతిస్తాడు అంటే చెప్పడం కష్టమే. ఎందుకంటే ఎవరూ బహిరంగంగా సినిమా వాళ్ళు రాజకీయాల గురించి మాట్లాడరు. పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వరు. అయినప్పటికీ కొన్ని ఆధారాలు, వివిధ సందర్భాల్లో వాళ్ళు మాట్లాడిన మాటల ఆధారంగా… ఫలానా హీరో ఫలానా పార్టీ సానుభూతి పరుడని చెప్పొచ్చు. ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన మూడు ప్రధాన పార్టీలు. బీజేపీ కూడా ఎదిగే ప్రయత్నం చేస్తుంది. ఏ హీరో ఏ పార్టీకి మద్దతు అనేది పరిశీలిస్తే…

మెగా హీరోలందరూ జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నారు. కుర్ర హీరోలైన సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, చరణ్ ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. చిరంజీవి సైతం ప్రజలు ఏదో ఒకరోజు పవన్ ని సీఎం పీఠం మీద కూర్చోబెడతారని చెప్పాడు. అయితే అల్లు అర్జున్ ఎటు అనేది సస్పెన్స్. ఆయన మెగా ఫ్యామిలీతో డిస్టెన్స్ మైంటైన్ చేస్తున్నాడు. బాలకృష్ణ టీడీపీ ఎమ్మెల్యే. నందమూరి హీరోలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రం టీడీపీకి తమ మద్దతు ప్రకటించడం లేదు.

ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ టీడీపీకి దూరంగా ఉంటున్నా వాళ్ళు మరొక పార్టీ సానుభూతి పరులని చెప్పలేం. మహేష్ బాబు ఎప్పుడూ పొలిటికల్ కామెంట్స్ చేయలేదు. అయితే వాళ్ళ నాన్న కృష్ణ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు. వైఎస్సార్-కృష్ణ మధ్య మంచి అనుబంధం ఉంది. ఈ క్రమంలో మహేష్ వైసీపీ సానుభూతి పరుడనే వాదన ఉంది. నాగార్జున కూడా వైసీపీ సానుభూతి పరుడని అంటారు. ఆ మధ్య టికెట్స్ ధరల పెంపుపై చిరంజీవి పోరాటం చేస్తుంటే… బంగార్రాజు చిత్రానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన రేట్లు చాలు అని తన మద్దతు తెలిపాడు.

ప్రభాస్ బీజేపీ సానుభూతి పరుడనే వాదన ఉంది. ఆయన పెదనాన్న కృష్ణంరాజు బీజేపీ నాయకుడు. బీజేపీ ప్రభుత్వానికి కరోనా సమయంలో ప్రభాస్ కోట్ల రూపాయల విరాళాలు ఇచ్చాడు. ఇక మోహన్ బాబు ఫ్యామిలీ గతంలో వైసీపీలో చేరారు. ఈ మధ్య చెడినట్లు ఉంది. వైఎస్ జగన్ తో డిస్టెన్స్ మైంటైన్ చేస్తున్నారు. బీజేపీ నేతలతో సన్నిహితంగా ఉంటున్నారు. హీరో నాని, రామ్ పోతినేని టీడీపీ సానుభూతి పరులు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు వైసీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు. హీరో నితిన్ జనసేన అనడంలో సందేహం లేదు. ఇది స్పష్టమైన సమాచారం కాదు, ఒక అంచనా మాత్రమే…