Yatra 2 Teaser: 2019లో విడుదలైన యాత్ర మూవీ సూపర్ హిట్. మహి వి రాఘవ దర్శకత్వంలో మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కింది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది యాత్ర చిత్రం. ఈ చిత్రానికి కొనసాగింపుగా వస్తుంది యాత్ర 2. నేడు యాత్ర 2 టీజర్ విడుదల చేశారు. యాత్ర 2 వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు వైఎస్ జగన్ జీవితంలో జరిగిన ఘటనల సమాహారం గా తెరకెక్కించారు.
రెండోసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గెలిచిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణానంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు యాత్ర 2 టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. యాత్ర 2 టీజర్ పరిశీలిస్తే చాలా ఎమోషనల్ గా సాగింది. కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అధిష్టానానికి ఎదురెళ్ళిన యంగ్ లీడర్ గా వైఎస్ జగన్ ని చూపించారు.
ఢిల్లీ పీఠాన్ని ఎదిరించినందుకు అవినీతి కేసులు మోపారని, జైలు పాలు చేశారని చెప్పే ప్రయత్నం జరిగింది. పరోక్షంగా కాంగ్రెస్ పెద్దలను, సోనియా గాంధీని విలన్ గా యాత్ర 2 మూవీలో చూపించారు. అయితే వైఎస్ జగన్ క్యారెక్టర్ ని ఎలివేట్ చేసేలా ఉన్న డైలాగ్స్, సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. చాలా ఎమోషనల్ గా ఉన్నాయి. యాత్ర 2 టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. వైఎస్ జగన్ అభిమానులకు ఫీస్ట్ అని చెప్పొచ్చు.
యాత్ర 2 వరల్డ్ వైడ్ ఫిబ్రవరి 8న విడుదల కానుంది. వైఎస్ జగన్ పాత్రను కోలీవుడ్ నటుడు జీవా చేశారు. మరోసారి వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా ముమ్ముట్టి అలరించనున్నారు. త్రీ ఆటమన్ లీవ్స్, వి సెల్యూలాయిడ్ బ్యానర్స్ పై శివ మేక నిర్మిస్తున్నారు. యాత్ర 2 చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు.
