కేజీఎఫ్-2 రిలీజ్ డేట్ ఫిక్స్

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బహుబలి’ సీరీస్ కలెక్షన్ల రికార్డులు సృష్టించిన సంగతి తెల్సిందే. బహుబలి మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. ఇండియాలో అత్యధికంగా కలెక్షన్లు రాబట్టిన లిస్టులో బహుబలి-2 ముందంజలో ఉంటుంది. హాలీవుడ్ సినిమాలకు ధీటుగా రాజమౌళి మూవీలు ఉండటంతో ఆయన సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఏర్పడింది. బహుబలి మాదిరిగానే ఇండియాలో రికార్డులు సృష్టించిన మరో మూవీ కేజీఎఫ్. యష్ హీరోగా నటించిన కేజీఎఫ్ మూవీ కూడా బహుబలి రేంజ్లో అభిమానులను అలరించింది. కేజీఎఫ్ మూవీకి […]

Written By: Neelambaram, Updated On : March 14, 2020 10:53 am
Follow us on

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బహుబలి’ సీరీస్ కలెక్షన్ల రికార్డులు సృష్టించిన సంగతి తెల్సిందే. బహుబలి మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. ఇండియాలో అత్యధికంగా కలెక్షన్లు రాబట్టిన లిస్టులో బహుబలి-2 ముందంజలో ఉంటుంది. హాలీవుడ్ సినిమాలకు ధీటుగా రాజమౌళి మూవీలు ఉండటంతో ఆయన సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఏర్పడింది. బహుబలి మాదిరిగానే ఇండియాలో రికార్డులు సృష్టించిన మరో మూవీ కేజీఎఫ్. యష్ హీరోగా నటించిన కేజీఎఫ్ మూవీ కూడా బహుబలి రేంజ్లో అభిమానులను అలరించింది.

కేజీఎఫ్ మూవీకి ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ మూవీలో యష్ పక్కన శ్రీనిధిశెట్టి నటించింది. ఈ మూవీ విడుదలైన అన్ని భాషల్లో భారీ కలెక్షన్లు రాబట్టింది. ఈ మూవీకి సీక్వెల్‌గా కేజీఎఫ్-2 వస్తోంది. ‘కేజీఎఫ్’ మూవీ భారీ విజయం సాధించడంతో కేజీఎఫ్-2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ తారాగణంతో ఎక్కడ రాజీపడకుండా సినిమాను తెరకెక్కిస్తున్నారు.

‘కేజీఎఫ్-2’లో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. రావురమేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ను చిత్రబృందం తాజాగా ప్రకటించింది. అక్టోబర్‌ 23న ప్రపంచ వ్యాప్తంగా కేజీఎఫ్‌-2 విడుదల చేస్తున్నట్టు చిత్రబందం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. పోస్టర్‌లో ‘మే ఐ కమింగ్‌’ అనే టాగ్‌తో యశ్ మాస్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.