Yashmi Gowda : బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన కంటెస్టెంట్స్ లో ఒకరు యష్మీ గౌడ(Yashmi Gowda). అంతకు ముందు కూడా ఈమె అనేక టీవీ సీరియల్స్ లో నటించింది. జీ తెలుగు లో ప్రసారమైన ‘నాగ భైరవి’ అనే సూపర్ హిట్ సీరియల్ ద్వారా బుల్లితెర ఆడియన్స్ కి హీరోయిన్ గా పరిచయమైన ఈమె, ఆ తర్వాత స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్ ద్వారా విలన్ గా తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఈ సీరియల్ కొనసాగుతుండగానే మధ్యలోనే ఆమె ఆగిపోయింది. ఎందుకంటే నెగెటివ్ రోల్ కారణంగా సోషల్ మీడియా లో ఆమె తీవ్రమైన బూతులతో కూడిన తిట్లు ఎదురుకోవడం వల్లనే అని ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. ఆ తర్వాత కొంతకాలం కేవలం సోషల్ మీడియా కి మాత్రమే పరిమితమైన ఈమెకు, బిగ్ బాస్ లో ఆఫర్ వచ్చింది.
Also Read : కమిట్మెంట్ అంటే ఏంటో తెలియక ఓకే అన్నాను.. లైంగిక వేధింపులపై నోరు విప్పిన జబర్దస్త్ రోహిణి! ఆ నిర్మాత ఎవరు?
బిగ్ బాస్ సీజన్ 8(Bigg Boss 8 Telugu) ప్రారంభం నుండే అమ్మాయిలలో టాస్కులు గట్టిగా ఆడే కంటెస్టెంట్ గా, ఆడపులి గా పేరు తెచ్చుకున్న యష్మీ, ఆ తర్వాత నిఖిల్ తో ప్రేమలో పడి, కేవలం అతని కోసం మాత్రమే గేమ్స్ ఆడుతూ, తన ఒరిజినల్ గేమ్ మొత్తాన్ని చెడగొట్టుకుంది. అలా ఫైనల్స్ వరకు కచ్చితంగా ఉంటుంది అనుకున్న ఈమె, 12 వ వారం లోనే ఎలిమినేట్ అయ్యి బయటకి వచ్చేసింది. బయటకు వచ్చిన తర్వాత పార్టీలు, పబ్బులు చుట్టూ తిరుగుతూ జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేస్తుందో ఆమె సోషల్ మీడియా ని గమనించే వాళ్లకు అర్థం అవుతుంది. అప్పుడప్పుడు స్టార్ మా ఛానల్ లో పెడుతున్న స్పెషల్ ఈవెంట్స్ లో కూడా పాల్గొంటున్న యష్మీ ప్రస్తుతానికి ఖాళీగానే ఉంది. అయితే బయటకు వచ్చిన తర్వాత కంటెస్టెంట్స్ అందరూ దాదాపుగా ఇంటర్వ్యూస్ ఇచ్చారు. కానీ యష్మీ మాత్రం ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు.
అయితే రీసెంట్ గా ఈమె పెళ్లి పీటలు ఎక్కినట్టు సోషల్ మీడియా లో ఒక వీడియో బాగా వైరల్ అవ్వడం ఆమె అభిమానులను షాక్ కి గురి చేసింది. యష్మీ ఎప్పుడు పెళ్లి చేసుకుంది?, పెళ్లి కొడుకు ఎవరు?, అసలు ఈ పెళ్లి వీడియో ఎక్కడిది అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో బాగా వైరల్ అయ్యింది కానీ, యష్మీ నుండి మాత్రం ఎలాంటి రియాక్షన్ ఇది వరకు రాలేదు. అయితే ఆమె అభిమానులు ఈ వీడియో పై స్పందిస్తూ, ఇది నిజమైన పెళ్లి కాదని, ఒక సీరియల్ లోని పెళ్లి సన్నివేశాలకు సంబంధించిన షాట్స్ అని చెప్తున్నారు. కానీ యష్మీ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడం తో ఆమెకు నిజంగా పెళ్లి జరిగిపోయింది అని చాలా మంది అనుకుంటున్నారు. మరి ఈ వీడియో ని చూసి మీ అభిప్రాయమేంటో కామెంట్స్ ద్వారా తెలియజేయండి.