Homeఎంటర్టైన్మెంట్Yash comments on Toxic delay: 'టాక్సిక్' చిత్రాన్ని ఆ కారణం చేతనే వాయిదా వేస్తున్నాము...

Yash comments on Toxic delay: ‘టాక్సిక్’ చిత్రాన్ని ఆ కారణం చేతనే వాయిదా వేస్తున్నాము అంటూ యాష్ హాట్ కామెంట్స్..

Yash comments on Toxic delay: ‘KGF చాప్టర్ 2’ విడుదలై మూడేళ్లు పూర్తి అయ్యింది. కానీ రాకింగ్ స్టార్ యాష్ నుండి ఇప్పటి వరకు ఒక సినిమా కూడా విడుదల అవ్వలేదు . ఈ స్థాయి పాన్ ఇండియన్ హీరోలందరూ రెండు మూడు సినిమాలను విడుదల చేసి భారీ హిట్స్ ని కూడా అందుకున్నారు. కానీ యాష్ నుండి ఒక్క సినిమా కూడా విడుదల అవ్వకపోవడం గమనార్హం. KGF చాప్టర్ 2 విడుదలైన చాలా రోజులకు ‘టాక్సిక్’ చిత్రాన్ని మొదలు పెట్టాడు యాష్. ఈ సినిమాని శరవేగంగానే పూర్తి చెయ్యాలని అనుకున్నారు కానీ , రీ షూట్స్ ఎక్కువ జరగడం వల్ల కుదర్లేదు. ఎట్టకేలకు షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని మార్చి 19 న విడుదల అవ్వడానికి సిద్ధమైంది. ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ని కూడా ప్రారంభించారు. కానీ చివరి నిమిషం లో వాయిదా వేయాల్సి వచ్చింది.

జూన్ 4 న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. కానీ నేడు జూన్ 4 న కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయడం లేదని యాష్ అధికారిక ప్రకటన చేసాడు. దీంతో అభిమానులు తీవ్రమైన నిరాశకు గురయ్యారు. కనీసం ఎప్పుడు విడుదల చేయబోతున్నారు అనే విషయాన్నీ కూడా మేకర్స్ నేడు తెలపలేదు. యాష్ మాట్లాడుతూ ‘టాక్సిక్ అనేది కేవలం ఒక చిత్రం మాత్రమే కాదు , ఒక అద్భుతమైన అనుభవం. ఈ సినిమాకు ‘కామిక్ కాన్ ‘ వేదిక పై వచ్చిన రెస్పాన్స్ ని చూసి మేము చాలా థ్రిల్ కి గురయ్యాము. ఇది కేవలం ఇండియన్ ఆడియన్స్ కి మాత్రమే పరిమితం చెయ్యాలని మేము అనుకోవడం లేదు. అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని అనుకుంటున్నాము. మన ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ ని పెంచే సత్తా ఈ సినిమాకు ఉండడం వల్లే , ఈ నిర్ణయం తీసుకున్నాము’.

‘గ్లోబల్ వైడ్ గా ప్రముఖ సంస్థ లతో చేతులు కలిపి ఈ చిత్రాన్ని అన్ని అంతర్జాతీయ భాషల్లో విడుదల చేయడమే మా లక్ష్యం. కొన్ని సినిమాలు ఆలస్యం అయినా అద్భుతమైన ఫలితాలను అందిస్తుంటాయి, మా చిత్రం కూడా ఆ కోవకు చెందినదే , తయచేసి అభిమానులు , ప్రేక్షకులు ఓపిక పట్టండి , మీరు జీవితాంతం గుర్తించుకోదగ్గ థియేట్రికల్ అనుభూతిని మా టాక్సిక్ చిత్రం అందిస్తుందని బలమైన నమ్మకం తో చెప్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు యాష్ . ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అభిమానులు మాత్రం ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది , ఇక మా వల్ల కాదు అనే స్థాయికి వచ్చేసారు. సినిమా మీద కూడా బజ్ ఒకప్పుడు ఉన్నంత రేంజ్ లో ఇప్పుడు లేదు, బజ్ లేని సినిమాలకు ఎలాంటి ఓపెనింగ్స్ వస్తున్నాయో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం అంటూ చెప్పుకొస్తున్నారు నెటిజెన్స్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version