https://oktelugu.com/

Toxic Movie: ‘టాక్సిక్ ‘ సినిమా షూట్ స్టార్ట్ చేసిన యశ్…ఇదో మరో కేజీఎఫ్ అవుతుందా..?

సినిమాల్లో ఒక మంచి నటుడిగా ప్రూవ్ చేసుకోవాలి అంటే నటనకు స్కోప్ ఉన్న ఒక మంచి క్యారెక్టర్ అయితే దొరకాలి. అలాంటి పాత్రలు దొరికినప్పుడే ఒక నటుడి నటన అనేది బయటకు వస్తుంది...

Written By:
  • Gopi
  • , Updated On : August 8, 2024 / 11:50 AM IST

    Toxic Movie

    Follow us on

    Toxic Movie: కన్నడ సినిమా ఇండస్ట్రీలో మాస్ హీరోగా మంచి పేరు సంపాదించుకున్న నటుడు యశ్…ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన కే జి ఎఫ్ సినిమాతో పాన్ ఇండియాలో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఒక హీరో అంటే ఎలా ఉండాలో తన నటన ద్వారా ప్రూవ్ చేసి చూపించాడు. ఇక మొదటి పార్ట్ సూపర్ సక్సెస్ అయిన తర్వాత సెకండ్ పార్ట్ పైన అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాని కూడా తీసి సూపర్ సక్సెస్ లను అందుకున్నారు. ఇక దాంతో యశ్ ఒక్కసారిగా ఇండియా వైడ్ గా భారీ పాపులారిటీ ని సంపాదించుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఆయన గత కొన్ని రోజుల నుంచి చాలామంది పాన్ ఇండియా డైరెక్టర్లతో సినిమాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో డైరెక్టర్లు అందరూ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. దానివల్ల ఆయన కొద్ది రోజులపాటు ఒక పాన్ ఇండియా సబ్జెక్టు కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. ఇక అందులో భాగంగానే గీతు మోహన్ దాస్ చెప్పిన కథ అతనికి బాగా నచ్చడంతో ‘టాక్సిక్ ‘ అనే పేరుతో ఈ సినిమాకి తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ రోజు ఈ సినిమా చిత్రీకరణను చాలా గ్రాండ్ గా నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. దాంతో వేగంగా సినిమా షూటింగ్ పూర్తి చేసి ప్రేక్షకులందరికీ నచ్చే విధంగా ఈ సినిమాను తీర్చిదిద్దాలనే ప్రయత్నం చేస్తున్నారట…ఇక ఈ సినిమాతో మరోసారి తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక కేజీఎఫ్ వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు ముగిసినప్పటికీ ఆయన నుంచి మరొక సినిమా అయితే రాలేదు. ఇక దాంతో ఆయన అభిమానులు తీవ్రమైన నిరాశకు గురవుతున్నారు. కాబట్టి ఇప్పుడు వచ్చే సినిమాలతో ఎలాగైనా సరే ఆయన ఒక భారీ సక్సెస్ ను సాధించాలని చూస్తున్నాడు.

    అలాగే సినిమా సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ ఉండకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే బాలీవుడ్ స్టార్ హీరో అయిన ‘రన్బీర్ కపూర్ ‘ అలాగే తెలుగులో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందుతున్న ‘సాయి పల్లవి’ రాముడు, సీత క్యారెక్టర్లను పోషిస్తున్న ‘రామాయణం ‘ సినిమాలో యశ్ రావణాసురుడి పాత్రను పోషించడం విశేషం…

    ఇక పాన్ ఇండియాలో స్టార్ హీరో గా గొప్ప సక్సెస్ లను సాదించిన యశ్ ప్రస్తుతం అలాంటి సినిమాలో విలన్ పాత్రను పోషించడం అనేది ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారింది. ఇక ఏది ఏమైనప్పటికీ సినిమాలో ఒక క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటే అది విలన్ పాత్ర అయినా సరే తను చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రూవ్ చేయడానికే తను ‘రామాయణం ‘ సినిమాలో రావణాసురుడి పాత్రను పోషిస్తున్నాడు…

    ఇక ఈ రెండు సినిమాలతో 2025లో భారీ దండయాత్రను చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మరోసారి పాన్ ఇండియా లో మంచి నటుడిగా, స్టార్ హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకోవడమే తన అజెండాగా ముందుకు సాగుతున్నాడు…చూడాలి మరి ఈ సినిమాలతో ఆయన ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు అనేది…