Yash Raj Comeback: ఈ ఏడాది సంక్రాంతి ని అంత తేలికగా మనం మర్చిపోగలమా చెప్పండి..?, ఎప్పుడూ చూడని అద్భుతం జరిగింది. దిల్ రాజు నుండి ‘గేమ్ చేంజర్’,’సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలు మూడు రోజుల గ్యాప్ లో విడుదల అయ్యాయి. ‘గేమ్ చేంజర్’ అంటే రామ్ చరణ్(Global Star Ram Charan) లాంటి పాన్ ఇండియన్ స్టార్ హీరో నుండి వస్తున్న చిత్రం, శంకర్ డైరెక్టర్ అవ్వడం తో ఈ సినిమా పై అభిమానుల్లో ప్రేక్షకుల్లో విపరీతమైన హైప్,క్రేజ్ ఉండేది. అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. దిల్ రాజు కి అక్షరాలా 200 కోట్ల రూపాయిల నష్టం. ఇక అయిపోయింది ఆయన సంగతి, రోడ్డు మీదకి వచ్చేశాడు, ఇక దిల్ రాజు(Dil Raju) లేడంటూ ఎన్నో కథనాలు వచ్చాయి. తీరా చూస్తే ‘గేమ్ చేంజర్’ చిత్రానికి రావాల్సిన భారీ వసూళ్లు, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి వచ్చింది.
Also Read: ‘నన్ను బాగా మిస్ అవుతున్నారా?’..’వార్ 2′ తర్వాత నాగ వంశీ మొట్టమొదటి ట్వీట్!
‘గేమ్ చేంజర్’ తో నష్టపోయిన దిల్ రాజు, ‘సంక్రాంతికి వస్తున్నాం’ తో నిలబడ్డాడు, ఆయన సంస్థ కూడా బ్రతికింది, ఆయన్ని నమ్ముకున్న వాళ్లంతా సేఫ్ అయ్యారు. ఇలాంటి మ్యాజిక్స్ చాలా అరుదుగా జరుగుతుంటాయి, మళ్ళీ ఇలాంటి అద్భుతాలు జరగడం కష్టం అనుకున్నారు అందరూ. కానీ రీసెంట్ గా బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యాష్ రాజ్ ఫిలిమ్స్(Yash Raj Films) కి కూడా ఇలాంటిదే అనుభవం అయ్యింది. వాళ్ళ సంస్థ లో తెరకెక్కిన ‘సైయారా'(Saiyaara) మరియు ‘వార్ 2′(War 2 Movie) చిత్రాలు దాదాపుగా నెల రోజుల గ్యాప్ లో విడుదలయ్యాయి. ‘సైయారా’ చిత్రానికి విడుదలకు ముందే పాటలు సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అవ్వడం తో భారీ హైప్ తో ఈ చిత్రం విడుదలైంది. హైప్ కి తగ్గట్టు సినిమా కూడా ఉండడంతో బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ అయ్యింది. 5 వారాల్లో ‘సైయారా’ చిత్రం 332 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది.
Also Read: ‘వార్ 2’ కి వచ్చిన కలెక్షన్స్ లో మైనస్ షేర్స్..చరిత్రలో ఇదే తొలిసారి!
ఇప్పటికీ కూడా ఈ సినిమాకు డీసెంట్ స్థాయి వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఇక ‘వార్ 2’ విషయానికి వస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే దాదాపుగా 300 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రావాలి. ఇప్పటి వరకు కేవలం 130 కోట్ల రూపాయిలు మాత్రమే వచ్చాయి. వచ్చిన వసూళ్లు అధిక శాతం బాలీవుడ్ నుండి వచ్చినవే, టాలీవుడ్ లో మొదటి రోజు నుండి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఇబ్బంది పడుతూనే ఉంది. ఫుల్ రన్ లో మహా అయితే ఇంకో 30 కోట్ల షేర్ రీ కవర్ అవుతుందేమో అంతే. ఓవరాల్ గా 200 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. ఈ నష్టాన్ని మొత్తం ‘సై యారా’ చిత్రం రికవర్ చేసింది. అయితే ఈ అరుదైన ఘటనలు #RRR హీరోలకే యాదృచ్చికంగా జరగడం గమనార్హం.