వెండితెర పై తమ అందాలతో ప్రేక్షకులకు కనువిందు కలిగించే అందాల తారల వెనుక బాధాకరమైన అనారోగ్య సమస్యలుంటాయి. వారికీ చెప్పుకోలేని చాలా బాధలు ఉంటాయి. అందం కోసం యోగాలు, ఫిట్నెస్ మంత్రాలు వల్లించే హీరోయిన్ కూడా కొన్ని వ్యాధులతో బాధ పడుతున్నారు. మరి ఆ హీరోయిన్స్ లిస్ట్ లో బాలీవుడ్ నటి యామీ గౌతమ్ కూడా చేరింది.

పుట్టిన ప్రతి ఒక్కరికీ ఎదో ఒక వ్యాధి ఉంటుందని.. అందుకే తన వ్యాధిని పబ్లిక్ గా చెప్పడానికి యామీ గౌతమ్ మొహమాటపడలేదు. తనకున్న అరుదైన వ్యాధి గురించి అందరికీ చెప్పేసింది. ఇంతకీ ఆమె అనారోగ్య సమస్య ఏమిటో ఆమె మాటల్లోనే.. ‘చాలా సంవత్సరాలుగా కెరటోసిస్ పిలారిస్’ అనే అరుదైన చర్మ వ్యాధితో నేను బాధపడుతున్నాను’ అని యామీ సోషల్ మీడియా పోస్ట్ చేసింది.
ఆ వ్యాధికి సబంధించిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ‘ఈ వ్యాధితో నేను ఎంతగా బాధ పడినా.. ఇన్నాళ్లు దీన్ని ఎవరికీ చెప్పలేదు. దాచడానికి ఎంతో ప్రయత్నించాను. అయితే, ఇది ఏదో భయంకరమైన వ్యాధి కాదు. మరి అలాంటప్పుడు ఈ వ్యాధి గురించి చెప్పడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నావ్.. ఎందుకు భయ పడుతున్నావ్ ? అని నన్ను నేనే అడిగేదాన్ని. కానీ ఎట్టకేలకు ఇప్పటికీ ధైర్యంగా చెబుతున్నాను’ అని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది.
అన్నట్టు ప్రపంచంలో ఈ వ్యాధికి చికిత్స లేదు. అందుకే, యామీ గౌతమ్ ఈ వ్యాధి విషయంలో ఎంతో బాధ పడిందట. ఇక తన వ్యాధి విషయాన్ని పబ్లిక్ గా చెప్పిన తర్వాత మొత్తానికి తనకున్న భయాలు జయించినట్లుగా భావిస్తున్నానని యామీ చెప్పుకొచ్చింది. ఇంతకీ ఈ ‘కెరటోసిస్ పిలారిస్’ అనే చర్మ వ్యాధి వల్ల ఏమవుతుందో తెలుసా ? ఒంటి పై కురుపుల వంటి బొడిపెలు వస్తుంటాయి. పాపం అందమైన తారకు కురుపుల అంటే కష్టమే.