Homeఎంటర్టైన్మెంట్K.G.F: Chapter 2: 'కేజీఎఫ్ 2' నుంచి ఎదగరా ఎదగరా.. క్షణాల్లోనే సంచలనాలు

K.G.F: Chapter 2: ‘కేజీఎఫ్ 2’ నుంచి ఎదగరా ఎదగరా.. క్షణాల్లోనే సంచలనాలు

K.G.F: Chapter 2: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వస్తున్న ‘కేజీఎఫ్ 2’ కోసం యావత్తు మాస్ ప్రేక్షక లోకం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తోన్నారు. ఏప్రిల్‌ 14న సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ సినిమా గురించి ఓ అప్‌ డేట్ బయటకు వచ్చింది. సినిమా విడుదల దగ్గరపడుతోన్న నేపథ్యంలోనే చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ వేగాన్ని పెంచుతూ తాజాగా సినిమాలోని సెంటిమెంట్ పాటను రిలీజ్ చేసింది. ‘ఎదగరా ఎదగరా దినకరా’ అంటూ సాగిన ఈ పాట చాలా బాగుంది.

K.G.F: Chapter 2
K.G.F: Chapter 2

Also Read: Victory Venkatesh: ‘వెబ్ సిరీస్ – ద్విభాషా చిత్రం’ మధ్యలో వెంకటేష్

ముఖ్యంగా ఈ పాటలోని లిరిక్స్‌ చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి. మీ కోసం ఆ లిరిక్స్..

ఎదగరా ఎదగరా దినకరా..
జగతికే జ్యోతిగా నిలవరా..

పడమర, నిశితెర వాలనీ..
చరితగా, ఘనతగా వెలగరా..

అంతులేని గమ్యముకదరా
అంతవరకు లేడిక నిదురా.

అష్టదిక్కులన్నియు అదరా..
అమ్మ కన్న కలగా పదరా..

చరితగా, ఘనతగా వెలగరా..
చరితగా, ఘనతగా వెలగరా..

జనినగా దీవెనం
గెలుపుకే పుస్తకం
నీ శఖం

ధగ ధగా కిరణమై
ధరణిపై చెయ్యరా సంతకం

అంటూ ఈ సాంగ్ సాగింది.

K.G.F: Chapter 2
K.G.F: Chapter 2

ఇక ఈ సాంగ్ విడుదలైన కొన్ని క్షణాల్లోనే రికార్డ్‌ వ్యూస్‌ తో దూసుకుపోతోంది. ఏది ఏమైనా దక్షిణాది పాన్ ఇండియా సినిమాలలో బాహుబలి తర్వాత కేజీఎఫ్ చాప్టర్ 1 సినిమానే భారీ విజయం సాధించింది. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ను నేషనల్ స్టార్ ను చేసింది. అందుకే కెజిఎఫ్ 2 చిత్రంపై ప్రేక్షకులలో ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలోని అన్ని పరిశ్రమల్లో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొని ఉండటంతో ఈ సినిమా ఓపెనింగ్స్ తో సరికొత్త రికార్డ్స్ సృష్టించడం ఖాయం అంటున్నారు.

Also Read:Victory Venkatesh: ‘వెబ్ సిరీస్ – ద్విభాషా చిత్రం’ మధ్యలో వెంకటేష్

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

2 COMMENTS

  1. […] Srividya: ఇప్పటి సినిమాల్లో బికినీలు, పరిధి దాటిన సన్నివేశాలు సర్వసాధారణ అయిపోయాయి. కానీ, నలభై ఏళ్ల క్రితం ఒక నటి బికినీ వేసింది అంటే.. అప్పటికీ అది పెద్ద వింత. ఆ హీరోయిన్ గురించి ఒక దశాబ్దం పాటు చెప్పుకునేవారు. పైగా ఒక సహజ నటి అలాంటి నిర్ణయం తీసుకుంది అంటే.. అది నేటికీ షాకే. ఇంతకీ ఎవరు ఆ నటి ? మంచి నటిగా పేరు ఉన్న ఆమె ఎందుకు పరిధి దాటింది ? అసలు ఆమె ఓవర్ ఎక్స్ పోజింగ్ ఆమె కెరీర్ కి ప్లస్ అయ్యిందా ? లేక, ఇబ్బందులకు గురి చేసిందా ? వంటి ఆసక్తికర విషయాలు ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular