Y Vijaya- Vijaya Shanthi: పెద్ద పెద్ద కళ్లతో.. పదునైన డైలాగ్స్ తో.. ఆడాళ్లు ఇలాక్కూడా ఉంటారా? అనేంత ఆలోచింపజేసిన వైవిజయను ఆనాటి ప్రేక్షకులు ఎవరూ మరిచిపోరు. ఆమె సినిమాల్లో ఉందంటే విలన్ అక్కర్లేదు. ఆమె మెయిన్ విలన్ అన్నట్లుగా నటిస్తారు. సూర్యకాంతం తరువాత అంతటి క్రూరమైన లేడీగా నటించిన వైవిజయ కొన్నాళ్లపాటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇప్పుడు టీవీల్లో నటిస్తూ అలరిస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడు సినిమాలు కూడా చేస్తున్నారు. ఇటీవల ఆమె నటించిన సినిమాల్లో ఎఫ్2 సినిమాలో ఆమె నటనిజం మరోసారి చూపించింది. వైవిజయ పెళ్లి చేసుకున్న తరువాత కొన్నాళ్ల పాటు ఆర్థిక కష్టాలనెదుక్కొన్నారు. ఈ సమయంలో స్టార్ నటి విజయశాంతి ఇచ్చిన ఓ సలహాతో ఆమె ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థితికి చేరారు. ఇంతకీ వైవిజయకు ఆమె ఏమని సలహా ఇచ్చారు?
వైవిజయ బాల్యమంతా కడపలోనే సాగింది. వీరు మొత్తం 10 మంది సంతానం. వీరిలో విజయ ఐదో ఆమె. ప్రభుత్వ పాఠశాలలో చదివిన వై విజయ మరోవైపు నృత్యం నేర్చుకుంది. మొదటి నాట్య ప్రదర్శనను కడపలో ఇచ్చింది. ఆమెకు 13 సంవత్సారాల వయసు ఉన్న సమయంలో రామవిజేత ఫిలిమ్స్ నిర్మించిన ‘తల్లిదండ్రులు’ అనే సినిమాలో అవకాశం వచ్చింది. ఇందులో హీరో శోభన్ బాబు. ఆ తరువాత విచిత్ర బంధం, ఆడాళ్లు మీకూ జోహార్లు తదితర మొత్తం 280 సినిమాల్లో నటించారు.
ఆమె నటించిన ‘పెళ్లాం చెబితే వినాలి’లో వైవిజయ స్టార్ నటిగా మారిపోయింది. ఆ తరువాత ఆమె ఎక్కువగా ప్రతికూల పాత్రలతోనే గుర్తింపు పొందారు. కొన్ని సినిమాల్లో అమె కమెడియన్ గానూ నటించారు. లేటేస్టుగా వచ్చిన సినిమాల్లో సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ‘తెనాలి’లో విలన్ గా.. వెంకటేష్ హీరోగా వచ్చిన ‘ఎఫ్2’లో కమెడియన్ అలరించారు. ఎటువంటి పాత్ర ఇచ్చినా ఆమె చేయడానికి వెనుకాడలేదు.
వైవిజయది ప్రేమ వివాహం. 1985లో ఈమె అమలనాథన్ అనే తన స్నేహితుడిని పెళ్లి చేసుకుంది. వీరికి కుమార్తె అనుష్య ఉన్నారు. ఆమె నటించిన మంగమ్మగారి మనువడి సినిమా సందర్భంగా వైవిజయపై కొన్ని వార్తలు వచ్చాయి. ఇందులో ఆమె వ్యాంపు పాత్రలో నటించారు. బాయ్యా, బాయ్య అంటూ ఆమె మాట్లాడే తీరు ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. కానీ ఈ సినిమా తరువాత డైరెక్టర్ కోడి రామకృష్ణతో సన్నిహితంగా ఉన్నారని కొందరు అన్నారు. కానీ ఆ తరువాత ఇవి పుకార్లని తేలిపోయింది.
ఇక వైవిజయ సొంతంగా జీవితం ప్రారంభించిన తరువాత ఆర్థిక కష్టాలను ఎదుర్కొన్నారు. షూటింగ్ లేని సమయంలో ఆమె విజయశాంతితో కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకునేవారు. ఈ సందర్భంగా ఓసారి విజయశాంతి పెట్టుబడులపై కొన్ని సూచనలు ఇచ్చారు. ఆమె ఇచ్చిన ఆలోచనతో తంజావురులో కల్యాణ మండపం, కాంప్లెక్స్ నిర్మించారు. సినిమాలు లేనప్పుడు వీటిపై వచ్చే ఆదాయం ఎంతో ఉపయోగపడిందని వైవిజయ చెప్పుకొచ్చారు. అందుకే ఆమె విజయశాంతిని ఎప్పటికీ మరిచిపోనని చెబుతూ ఉంటారు.