Homeఎంటర్టైన్మెంట్Wrong Swipe: ఓటీటీ లో విడుదల కానున్న ‘రాంగ్ స్వైప్’ మూవీ...

Wrong Swipe: ఓటీటీ లో విడుదల కానున్న ‘రాంగ్ స్వైప్’ మూవీ…

Wrong Swipe: డాక్టర్ రవికిరణ్ గడలి దర్శకత్వంలో మెరూన్ వాటర్స్ ఎక్స్ లెన్స్ పతాకంపై డాక్టర్ ప్రతిమారెడ్డి నిర్మించిన చిత్రం ‘రాంగ్ స్వైప్’. క్షణిక సుఖం కోసం పక్క దారి పడితే… ఎటువంటి విపరిణాలను ఎదుర్కోవలసి వస్తుందో ఎంటర్‌టైనింగ్‌ వేలో చూపించే ఈ ఇండిపెండెంట్ ఫిల్మ్ నవంబర్‌ ఒకటి న ఓటీటీ ‘ఊర్వశి’లో విడుదల కానుంది.

wrong swipe movie going to releasing on november 1st in ott

స్వతహా డాక్టర్ అయిన రవికిరణ్… సినిమా మాధ్యమం పట్ల విపరీతమైన ప్యాషన్ తో.. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు స్వయంగా సమకూర్చుకున్నారు. అలానే దర్శకత్వం వహించడంతో పాటు… ఛాయాగ్రహణం కూడా అందించడం విశేషం. అంతేకాదు ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర కూడా పోషించారు. డాక్టర్ ఉదయ్ రెడ్డి, డాక్టర్ శ్రావ్యనిక, రాధాకృష్ణ, అనికా ప్రేమ్ ముఖ్యపాత్రలు పోషించారు.

నిర్మాత డాక్టర్ ప్రతిమా రెడ్డి మాట్లాడుతూ… లిమిటెడ్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మా డైరెక్టర్ డాక్టర్ రవికిరణ్ చాలా గొప్పగా తీర్చిదిద్దారు. అన్నీ తానై ముందుండి  ఈ సినిమాని నడిపించారు అని చెప్పారు. మెసేజ్ కి ఎంటర్టైన్మెంట్ జోడించి రూపొందిన ‘రాంగ్ స్వైప్’ అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉందని అన్నారు. కబీర్ రఫీ సంగీతం ఈ చిత్రానికి మరో హైలైట్ అని వివరించారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular