Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే వాళ్ళు ఫైనల్ చేస్తారు. ఒక సినిమా ఏ ట్రాక్ లో ఉంటే ఆడుతుంది. హీరో ఇమేజ్ కి తగ్గట్టుగా కథను ఎలా తీర్చి దిద్దాలి. అనేది వాళ్లకు పర్ఫెక్ట్ గా తెలుస్తుంది. అయితే త్రివిక్రమ్ కొరటాల శివ లాంటి రచయితలు దర్శకులుగా మారి సూపర్ సక్సెస్ లను సాధించారు… కొంతమంది రచయితలు మాత్రం మొదట రైటర్లుగా ఫెయిల్ అయ్యారు, కానీ దర్శకులుగా సక్సెస్ అయ్యారు. అందులో మొదటిగా మనం సుకుమార్ ని చెప్పుకోవచ్చు. సుకుమార్ కెరియర్ మొదట్లో రచయిత గా పనిచేశాడు. వాటితో అతనికి పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ దర్శకుడిగా మారిన తర్వాత టాప్ డైరెక్టర్ గా ఎదిగిపోయాడు. ఇక అనిల్ రావిపూడి సైతం రైటర్ గా చేసిన చాలా సినిమాలు సక్సెస్ లను సాధించలేదు. కానీ దర్శకుడిగా మారిన తర్వాత సక్సెస్ ఫుల్ సినిమాలను చేస్తూ టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు.
ఇప్పటివరకు ఆయన 9 సినిమాలు చేస్తే ఆ 9 సినిమాలు కూడా సూపర్ సక్సెస్ ని సాధించడం అంటే మామూలు విషయం కాదు… ఇక వీళ్లిద్దరూ రచయితలుగా ఫెయిల్ అయినప్పటికి దర్శకులుగా సక్సెస్ కావడం విశేషం…ఇక మరి కొంతమంది రచయితలు సైతం ఇప్పుడు దర్శకులుగా మారడానికి ప్రయత్నిస్తున్నారు…
రాబోయే రోజుల్లో సైతం మరింత మంది డైరెక్టర్స్ మారే స్కోప్ ఉంటుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో సెపరేట్ రైటర్ అనే వారు ఎవరూ లేరు. ఎవరి సినిమాకి వాళ్లే రైటర్ గా వ్యవహరిస్తున్నారు. డైరెక్టర్ తమకు సంబంధించిన కథను రాసుకుంటున్నాడు. దీనివల్ల రైటర్లు అని చెప్పుకోవడానికి కూడా ఎవరు ఉండడం లేదు…
ఇక ఏది ఏమైనా కూడా ఒక మంచి రైటర్ గొప్ప దర్శకుడు అవుతాడని అప్పట్లో దాసరి నారాయణ రావు చెబుతుండేవాడు… అయితే కొంతమంది రచయితలుగా ఉన్నప్పుడు వాళ్ళు మంచి కథ రాసిన కూడా దర్శకులు వాళ్ల థాట్స్ మొత్తాన్ని తీసుకోకపోవచ్చు. అందువల్ల కూడా కొన్ని సినిమాలు ప్లాప్ అవుతుంటాయి….


