https://oktelugu.com/

Vijayendra Prasad: రైటర్ విజయేంద్ర ప్రసాద్ కి ఇష్టమైన డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు…

విజయేంద్ర ప్రసాద్ రాజమౌళి కి రాసిన అన్ని సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించాయి. ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ లో చాలా దమ్ము ఉంటుంది. క్యారెక్టర్ల తాలూకు ఆర్క్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : February 10, 2024 / 08:19 AM IST

    Vijayendra Prasad

    Follow us on

    Vijayendra Prasad: ఒక సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలంటే దానికి మూల కారణం కథ… అలాంటి కథలను అందించే రచయితలు ఇండస్ట్రీ లో ఎంత మంది ఉన్నప్పటికీ తన కథలతో పాన్ ఇండియా లో భారీ సక్సెస్ లను అందుకున్న రచయిత మాత్రం ‘విజయేంద్ర ప్రసాద్ ‘అనే చెప్పాలి.

    అయితే ఒక రచయిత మంచి కథను ఇస్తే దర్శకుడు దానికి తగ్గట్టు గా స్క్రీన్ ప్లే ని రాసుకొని ప్రేక్షకులకు నచ్చేలా సినిమాను తెరకెక్కిస్తాడు. అందుకే ప్రతి సినిమాకి కథే మూలం. ఇక ఇది ఇలా ఉంటే విజయేంద్ర ప్రసాద్ రాజమౌళి కి రాసిన అన్ని సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించాయి. ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ లో చాలా దమ్ము ఉంటుంది. క్యారెక్టర్ల తాలూకు ఆర్క్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది.

    కాబట్టి ఆయన కథలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అయితే ఈయన రచయితగా ఎంత పాపులర్ అయ్యాడో, ఆయన కొడుకు అయిన రాజమౌళి డైరెక్టర్ గా ఆయన కంటే ఎక్కువ పాపులారిటీని సంపాదించుకున్నాడు. మరి ఇలాంటి క్రమంలో ఇంట్లోనే ఒక స్టార్ డైరెక్టర్ ని పెట్టుకున్న విజయేంద్రప్రసాద్ తనకి ఇష్టమైన డైరెక్టర్ ఎవరు అని అడిగితే మాత్రం తన కొడుకు అయిన ‘రాజమౌళి ‘ పేరు చెప్పకుండా, పూరి జగన్నాధ్ పేరు చెప్పాడు. అవును మీరు వింటుంది నిజమే విజయేంద్ర ప్రసాద్ కి ఇష్టమైన దర్శకుడు ‘పూరి జగన్నాథ్’..

    అందుకే ఆయన ఫోన్ లో వాల్ పేపర్ గా కూడా పూరి జగన్నాథ్ ఫోటోనే ఉంటుంది. పూరి అంటే తనకి ఇష్టమని, ఆయన మేకింగ్ స్టైల్ గాని, ఆయన రాసిన సినిమా కథలు గాని, ఆయన రాసుకున్న డైలాగులు గాని అన్ని చాలా ఫ్రెష్ గా ఉంటాయి. అందుకే పూరి అంటే నాకు చాలా ఇష్టం నేను ఆయన అభిమానిని అని చెప్పాడు. అలా ఒక స్టార్ రైటర్ కూడా పూరి జగన్నాథ్ అభిమాని అయి ఉండడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయమనే చెప్పాలి. అప్పట్లో ఆయన చేసిన ‘ పోకిరి’, ‘బిజినెస్ మ్యాన్ ‘ లాంటి చాలా సినిమాలు ఇండస్ట్రీ సూపర్ హిట్లుగా నిలవడమే కాకుండా ఇప్పుడున్న టాప్ హీరోలందరికీ ఒక సపరేట్ క్యారక్టరైజేషన్ ని క్రియేట్
    చేసి పెట్టాడు.

    ఒక సినిమాకి కథ ఎంత కీలకపాత్ర వహిస్తుందో పూరి జగన్నాథ్ సినిమాలను చూస్తే కూడా మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇక విజయేంద్ర ప్రసాద్ లాంటి స్టార్ రైటర్ కూడా పూరి జగన్నాథ్ అభిమాని అవ్వడం వల్ల, పూరీ అభిమానులు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు…