https://oktelugu.com/

‘Writer Padmabhushan’ OTT release : ‘రైటర్ పద్మభూషణ్’ ఓటీటీ విడుదల తేదీ వచ్చేసింది

‘Writer Padmabhushan’ OTT release : ఇటీవల విడుదలైన సినిమాలలో చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’.ప్రముఖ కమెడియన్ సుహాస్ హీరో గా తెరకెక్కిన ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది.కేవలం రెండు కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం 6 కోట్ల 45 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.అంటే బయ్యర్స్ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 4, 2023 / 10:34 PM IST
    Follow us on

    ‘Writer Padmabhushan’ OTT release : ఇటీవల విడుదలైన సినిమాలలో చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’.ప్రముఖ కమెడియన్ సుహాస్ హీరో గా తెరకెక్కిన ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది.కేవలం రెండు కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం 6 కోట్ల 45 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.అంటే బయ్యర్స్ పెట్టిన ప్రతీ పైసాకి మూడింతల లాభం అన్నమాట.

    విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ సుహాస్ ఈ సినిమా ద్వారా మరో మెట్టు ఎక్కేసాడు.ఒక పక్క కమెడియన్ గా చేస్తూ మరో పక్క హీరో గా కూడా రాణిస్తూ, మద్యమద్యలో విలన్ పాత్రలలో కూడా మెప్పిస్తూ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు సుహాస్.థియేటర్స్ లో ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీ లో విడుదల అవుతుందా అని పేక్షకులు ఎదురు చూస్తున్నారు.

    వాళ్ళ ఎదురు చూపులకు ఇక తెరపడినట్టే.ఈ సినిమా ఓటీటీ రైట్స్ జీ5 వారు భారీ మొత్తానికి కొనుగోలు చేసారు.విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని ఈనెల 22 వ తారీఖున స్ట్రీమింగ్ చెయ్యబోతున్నట్టు తెలుస్తుంది.త్వరలోనే జీ5 దీనిపై అధికారిక ప్రకటన చేయబోతుంది.

    థియేటర్స్ లో అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకున్న ఈ సినిమా ఓటీటీ లో కూడా అదే రేంజ్ రెస్పాన్స్ ని దక్కించుకుంటుందో లేదో చూడాలి.సుహాస్ ప్రస్తుతం ‘ఆనంద్ రావు అడ్వెంచర్స్’ అనే చిత్రం లో హీరో గా నటిస్తున్నాడు.హీరో గా ఆయన చేసిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యేసరికి ఇక మీదట ఆయన హీరోగానే కొనసాగబోతున్నాడా లేదా, మునుపటిలాగానే విలక్షణ క్యారెక్టర్స్ చేస్తాడా అనేది చూడాలి.