Naga Shaurya: యంగ్ హీరో నాగ శౌర్య రంగబలి మూవీతో ప్రేక్షకులను పలకరించారు. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి చేయలేదు. నాగ శౌర్య ఖాతాలో మరో ప్లాప్ పడ్డట్లు అయ్యింది. ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్న నాగ శౌర్య నెక్స్ట్ ధమాకా దర్శకుడితో మూవీకి కమిట్ అయ్యారు. త్రినాథరావు నక్కిన ధమాకా-నాగ శౌర్య కాంబోలో మూవీ సెట్ అయ్యింది. ఈ ప్రాజెక్ట్ ఐరా క్రియేషన్స్ బ్యానర్లో ఉషా ములుపూరి నిర్మించనున్నారు. అంటే సొంత బ్యానర్ లో ఈ ప్రాజెక్ట్ రూపొందనుంది.
కాగా తన మీద వచ్చే ఎఫైర్ రూమర్స్ మీద నాగ శౌర్య ఆసక్తికర కామెంట్స్ చేశారు. నేను పని చేసిన హీరోయిన్స్ తో ఎఫైర్ రూమర్స్ రాస్తుంటారు. మాళవిక, రాశి ఖన్నాతో పాటు పలువురు అమ్మాయిలతో లింక్ పెడుతూ వార్తలు వచ్చాయి. అవన్నీ నిరాధార కథనాలే. నేను ఇంత వరకు ఏ హీరోయిన్ తో డేటింగ్ చేయలేదు. నాకు హీరోయిన్ అనుష్క శెట్టి అంటే చాలా ఇష్టం. ఆమెతో లింక్ పెడుతూ ఎవరూ కథనాలు రాయలేదు. అనుష్క శెట్టితో ఎఫైర్ అని వార్తలు రాయండి ప్లీజ్… అని షాకింగ్ కామెంట్స్ చేశాడు.
నాగ శౌర్య గత ఏడాది వివాహం చేసుకున్నాడు. అనూష శెట్టి మెడలో మూడుముళ్లు వేశాడు. నాగ శౌర్య వివాహం బెంగుళూరులో కేవలం సన్నిహితులు, బంధువుల మధ్య జరిగింది. పరిశ్రమ ప్రముఖులకు ఆహ్వానం లేదు. అనూష శెట్టి బిజినెస్ ఉమన్. సొంతగా ఇంటీరియర్ డిజైన్ కంపెనీ నడుపుతుంది. ఇది ప్రేమ వివాహమా లేక పెద్దలు కుదిర్చిన పెళ్లా? అనేది తెలియదు.
ఇక నాగశౌర్య ఊహలు గుసగుసలాడే సినిమా బ్రేక్ ఇచ్చింది. ఛలో మూవీతో హిట్ కొట్టాడు. స్టార్ లేడీ రష్మిక మందానను తెలుగు తెరకు పరిచయం చేసింది నాగ శౌర్యనే. దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన ఛలో మంచి విజయం సాధించింది. మళ్ళీ ఛలో రేంజ్ హిట్ నాగ శౌర్యకు పడలేదు. దర్శకుడు వెంకీ కుడుములతో ఆ చిత్ర కథ విషయంలో విబేధాలు తలెత్తాయి. ఛలో కథ నాదే అని నాగ శౌర్య అన్నారు. ఆ మాటలను వెంకీ కుడుముల ఖండించారు.