https://oktelugu.com/

Vijayendra Prasad And Keeravani: విజయేంద్ర ప్రసాద్, కీరవాణి లేకపోతే రాజమౌళి లేడా..? ఆ ఇద్దరి వల్లే రాజమౌళి సక్సెస్ అవుతున్నాడా..? అసలు మ్యాటరేంటంటే..?

రాజమౌళి చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇక పాన్ ఇండియా లో తెలుగు సినిమా స్థాయి ఏంటో చూపించిన డైరెక్టర్ కూడా రాజమౌళి నే కావడం విశేషం...

Written By:
  • Gopi
  • , Updated On : August 10, 2024 3:27 pm
    Vijayendra Prasad And Keeravani

    Vijayendra Prasad And Keeravani

    Follow us on

    Vijayendra Prasad And Keeravani: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ కి సాధ్యం కానీ రీతిలో చేసిన ప్రతి సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలిపిన ఒకే ఒక దర్శకుడు రాజమౌళి…మొదట ‘శాంతి నివాసం’ సీరియల్ తో బుల్లితెర మీద దర్శకుడి గా పరిచయమైన రాజమౌళి…ఎన్టీయార్ తో ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమా చేసి బిగ్ స్క్రీన్ మీదకి వచ్చాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకుంటూ ఇప్పుడు పాన్ వరల్డ్ లో సినిమా చేసే రేంజ్ కి ఎదిగాడు… ఇక ఇదిలా ఉంటే రాజమౌళి మీద చాలా రోజుల నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. అవి ఏంటి అంటే రాజమౌళి సినిమాలకి కథ వాళ్ళ నాన్న అయిన విజయేంద్ర ప్రసాద్ అందిస్తూ ఉంటాడు. అలాగే ఆయన సినిమాలకి కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తుంటాడు. ఇక వీళ్లిద్దరూ కూడా రాజమౌళి కుటుంబ సభ్యులే కావడం విశేషం…

    నిజానికి వీళ్ళు లేకపోతే రాజమౌళి అంతా పెద్ద డైరెక్టర్ గా ఎదగలేక పోయేవాడు అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తుంటారు. నిజానికి రాజమౌళి చేసే సినిమాలన్నీ కూడా చాలా వైల్డ్ గా ఉంటాయి. ఆయన సినిమాల్లో యాక్షన్ ఎలిమెంట్స్ కీలక పాత్ర వహిస్తూ ఉంటాయి. అలాగే ఎమోషన్స్ కి కూడా ఆయన చాలా పెద్ద పీట వేస్తూ ఉంటాడు. ఇక ఒక కథని ఎమోషన్స్ తో రాయడంలో విజయేంద్ర ప్రసాద్ ను మించిన రైటర్ లేరనే చెప్పాలి. ఇక ఆయన రాసిన కథకు తగ్గట్టుగానే ఆ ఎమోషన్స్ ఎలివేట్ అవ్వాలంటే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా అత్యుత్తమంగా ఉండాలి. అది లేకపోతే మాత్రం ఆ సినిమాలోని ఎమోషన్ అనేది పండదు.

    ఇక దర్శకుడు ఎంత బాగా డైరెక్షన్ చేసిన కూడా ఆ సీన్ లో ఉన్న కోర్ ఎమోషన్ అనేది ప్రేక్షకుడి హార్ట్ ని మాత్రం టచ్ అవ్వదు. కాబట్టి ఈ ఇద్దరి వల్లే రాజమౌళి టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు అని చాలామంది చెబుతూ ఉంటారు. నిజానికి రాజమౌళి లాంటి గొప్ప డైరెక్టర్ వాళ్ల దగ్గర నుంచి తనకు కావాల్సిన ఔట్ పుట్ మాత్రం తీసుకుంటూ ఉంటారు. తనకి ఎలాంటి కథ కావాలో రాజమౌళి ముందుగానే విజయేంద్రప్రసాద్ కి చెబుతాడు.

    ఆయన కథ ఇచ్చిన తర్వాత రాజమౌళి చాలా వరకు దాంట్లో మార్పులు చేర్పులు చేస్తూ ఒక మంచి స్క్రీన్ ప్లే రాసుకుంటాడు. అలాగే ఆ సినిమాకి తగ్గట్టుగా ఎమోషన్ ని కూడా బిల్డ్ చేసుకుంటాడు. ఇక కీరవాణి దగ్గర నుంచి ఒక మంచి మ్యూజిక్ ని రాబట్టుకోవడంలో కూడా ఆయన చాలా వరకు సక్సెస్ అవుతూ ఉంటాడు. ఇక కీరవాణి మిగతా దర్శకులకు ఇచ్చిన మ్యూజిక్ కంటే రాజమౌళికి ఇచ్చిన మ్యూజిక్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇక రాజమౌళి సక్సెస్ లో వాళ్ళిద్దరూ ఒక భాగం మాత్రమే, కానీ వాళ్ళ వల్లే రాజమౌళి సక్సెస్ అయ్యాడు అనేది మాత్రం సరైన విషయం కాదని మరి కొంతమంది ట్రేడ్ పండితులు కూడా వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…