https://oktelugu.com/

Bigg Boss 6 Telugu Winner: మూడు వారాల్లోనే బిగ్ బాస్ 6 టైటిల్ విన్నర్ ఎవరో తెలిసిపోయింది..ఇది మాములు ట్విస్ట్ కాదు

Bigg Boss 6 Telugu Winner: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ రియాలిటీ షో ఎలాంటి వినోదం పంచుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఇప్పటి వరుకు 5 సీసన్స్ ని పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇప్పుడు ఆరవ సీసన్ లోకి అడుగుపెట్టి మూడు వారాలు పూర్తి చేసుకుంది..ఈ ఆరవ సీసన్ ముందు సీసన్స్ తో పోలిస్తే తక్కువ అనే చెప్పాలి..దానికి కారణం హౌస్ మేట్స్..గత సీసన్స్ లో హౌస్ మేట్స్ చాలా స్ట్రాంగ్ గా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : September 29, 2022 / 01:10 PM IST
    Follow us on

    Bigg Boss 6 Telugu Winner: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ రియాలిటీ షో ఎలాంటి వినోదం పంచుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఇప్పటి వరుకు 5 సీసన్స్ ని పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇప్పుడు ఆరవ సీసన్ లోకి అడుగుపెట్టి మూడు వారాలు పూర్తి చేసుకుంది..ఈ ఆరవ సీసన్ ముందు సీసన్స్ తో పోలిస్తే తక్కువ అనే చెప్పాలి..దానికి కారణం హౌస్ మేట్స్..గత సీసన్స్ లో హౌస్ మేట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండేవారు..టాస్కులు వస్తే చాలు రెచ్చిపోయి మరి ఆడేవారు..కానీ ఈ సీసన్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ లో కేవలం ఒకరిద్దరు తప్ప మిగిలిన అందరూ సచ్చు ఆటనే ఆడుతున్నారని చెప్పాలి..రెండవ వారం లో నాగార్జున గారు ఇంటి సభ్యులందరికి గట్టిగా మందలించడం వెళ్లి హౌస్ మేట్స్ ఈ మాత్రమైనా ఆడుతున్నారు..లేకపోతే ఇంకా దారుణంగా ఆడేవారు అని అంటున్నారు విశ్లేషకులు..ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం బిగ్ బాస్ సీసన్ 6 విన్నర్ ఎవరో అప్పుడే తేలిపోయింది..గత సీసన్స్ లో విన్నర్ ఎవరో మనకి అర్థం అవ్వడానికి సుమారు 8 వారాలు పట్టేది..కంటెస్టెంట్స్ అప్పట్లో అంత టఫ్ గా ఉండేవారు..కానీ ఈ సీసన్ లో మూడు వారాలు పూర్తి అయ్యేలోపే బిగ్ బాస్ విన్నర్ ఎవరో తేలిపోయింది..మిగిలిన ఇంటి సభ్యులు బాగా వీక్ అవ్వడం వల్లే ఇలా బిగ్ బాస్ విన్నర్ ఎవరో ముందుగా అంచనా వేసేయగల్తున్నాం అంటున్నారు విశ్లేషకులు.

    nagarjuna

    ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ని బట్టి చూస్తే ఈ సీసన్ టైటిల్ విన్నర్ గా రేవంత్ నిలవబోతున్నాడని తెలుస్తుంది..టాస్కులు ఆడడం లో కానీ..మనసులో ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కోటేటట్టు మాట్లాడడం లో కానీ రేవంత్ దిట్ట..అందుకే ఆడియన్స్ లో మంచి మార్కులు కొట్టేసాడు..హౌస్ లో టాస్క్ వచ్చిందంటే కసి గా ఆడే కంటెస్టెంట్స్ లో ఈయన మొదటి స్థానం లో కొనసాగుతున్నాడు..ప్రతి వారం నామినేషన్స్ లో వస్తున్నప్పటికీ వోటింగ్ లో అందరికంటే ముందు స్థానం లో కొనసాగుతున్నాడు.

    Bigg Boss 6 Telugu Winner

    ప్రస్తుతం బిగ్ బాస్ టైటిల్ ని గెలుచుకునే అవకాశం రేవంత్ కి ఎక్కువ ఉంది..ఆయన తర్వాత రెండవ స్థానం లో ఇనాయ సుల్తానా ఉందని చెప్పొచ్చు..ఈమె మొదటి వారం నామినేషన్స్ లోకి వచ్చినప్పుడు అందరికంటే తక్కువ ఓట్లతో ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్..ఆ వారం బిగ్ బాస్ ఎలిమినేషన్ తీసివేయడం తో అదృష్టం తో బయటపడింది ఇనాయ..తనకి వచ్చిన ఆ అద్భుతమైన అవకాశం ని సద్వినియోగ పరుచుకొని రోజు రోజు కి తన ఆట తీరుని పెంచుకుంటూ ఇప్పుడు రెండవ స్థానం లోకి ఎగబాకింది..ఇది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి..ఇక మూడవ స్థానం లో శ్రీహాన్ , నాల్గవ స్థానం లో కీర్తి మరియు 5 వ స్థానం లో గీతూ కొనసాగుతున్నారు..ఈ సీసన్ లో చివరి వరుకు టాప్ 5 కంటెస్టెంట్స్ గా కొనసాగే అవకాశం ఉందని ప్రస్తుత ట్రెండ్ చెప్తుంది..మరి భవిష్యత్తులో ఈ ట్రెండ్ మారుతుందో లేదో చూడాలి.

    Tags