https://oktelugu.com/

Devara: కేవలం 20 గంటల్లో 7 కోట్లు.. #RRR ని మించిన ‘దేవర’..ఇదేమి క్రేజ్ సామీ!

రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బుకింగ్స్ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఎదురు చూపులకు తెరదించుతూ నిన్న అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టారు. ఈ బుకింగ్స్ మొదలు పెట్టిన 20 గంటలోపే 7 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇప్పటి వరకు 85 థియేటర్స్ లో 680 షోస్ ని షెడ్యూల్ చేయగా, 65 శాతం కి పైగా ఆక్యుపెన్సీ నమోదు అయ్యింది.

Written By:
  • Vicky
  • , Updated On : September 24, 2024 / 05:50 PM IST

    Devara(3)

    Follow us on

    Devara: రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ‘దేవర’ మేనియా ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మొదటి రోజే ఈ సినిమాని చూసేయాలి అనే ఆత్రుత జనాల్లో ఏ స్థాయిలో ఉందో అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తేనే అర్థం అవుతుంది. దానికి తోడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ చిత్రం టికెట్ రేట్స్ పెంపునకు అనుమతించడం, అదనపు షోస్ తో పాటుగా, మిడ్ నైట్ షోస్ కి కూడా అనుమతులు ఇవ్వడంతో భారీ ఓపెనింగ్స్ సాధించే దిశగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రస్తుత ట్రెండ్ నడుస్తుంది. ఓవర్సీస్ లో ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ నెల రోజుల ముందే మొదలైంది. కేవలం నార్త్ అమెరికా నుండే ఈ చిత్రానికి 2 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు ప్రీమియర్ షోస్ కి వచ్చింది.

    ఇక రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బుకింగ్స్ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఎదురు చూపులకు తెరదించుతూ నిన్న అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టారు. ఈ బుకింగ్స్ మొదలు పెట్టిన 20 గంటలోపే 7 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇప్పటి వరకు 85 థియేటర్స్ లో 680 షోస్ ని షెడ్యూల్ చేయగా, 65 శాతం కి పైగా ఆక్యుపెన్సీ నమోదు అయ్యింది. ఇంత తక్కువ షోస్ తో ఇంత తక్కువ సమయం లో ఈ స్థాయి బుకింగ్స్ అనేది చిన్న విషయం కాదు. ఇంకా 700 షోస్ కి పైగా అదనంగా షెడ్యూల్ చేసే అవకాశం ఉంది. ఈ షోస్ నుండి మరో 7 నుండి 8 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది.

    మొత్తం మీద అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ సినిమాకి 15 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కేవలం హైదరాబాద్ నుండే వచ్చే అవకాశాలు ఉన్నాయి. #RRR చిత్రానికి హైదరాబాద్ నుండి 13 కోట్ల రూపాయిల అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ వచ్చింది. ఇప్పుడు ‘దేవర’ చిత్రం ఆ గ్రాస్ ని రెండు కోట్ల రూపాయిల మార్జిన్ తో దాటేయడం అందరినీ షాక్ కి గురి చేస్తున్న విషయం. మొదటి నుండి ఎన్టీఆర్ కి నైజాం ప్రాంతం లో తక్కువ వసూళ్లు వస్తుంటాయని అందరూ అంటూ ఉంటారు. కానీ ‘దేవర’ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ తో తన సత్తా ఏమిటో ఎన్టీఆర్ చూపించాడు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తుంటే దేవర నైజాం ప్రాంతం మొత్తం మీద 23 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు మొదటి రోజు నుండి రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు. ‘కల్కి’, ‘సలార్’ చిత్రాలకు కూడా ఈ స్థాయి ఓపెనింగ్స్ వసూళ్లు రాలేదు. టాక్ వస్తే ఈ చిత్రం కేవలం నైజాం ప్రాంతం నుండే ఫుల్ రన్ లో 75 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.