Telugu cinema quality debate: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లందరు పాన్ ఇండియా నేపథ్యంలో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. కొంతమంది పాన్ వరల్డ్ స్థాయికి వెళ్ళాలనే ప్రయత్నం చేస్తున్నారు. దానికోసమే డిఫరెంట్ కథలను ట్రై చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నంలో ఉన్నారు. ఎప్పుడైతే మంచి కథతో సినిమా వస్తుందో ఆ మూవీని ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక రాజమౌళి – సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకులు మన సినిమా పరిధిని అంతకంతకు విస్తరింప చేస్తూ ముందుకు దూసుకెళ్తుంటే కొందరు కమర్షియల్ డైరెక్టర్లు మాత్రం తెలుగు సినిమా స్టాండర్డ్ ని మరింత దిగజారుస్తున్నారు అంటూ కొంతమంది సినిమా విమర్శకులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… హాలీవుడ్ ఇండస్ట్రీకి సైతం పోటీని ఇచ్చే రేంజ్ లో మన సినిమాలను ముందుకు తీసుకెళ్లాలని మన మేకర్స్ కొత్త ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు.
కానీ అనిల్ రావిపూడి, బాబీ, గోపిచంద్ లాంటి దర్శకులు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను చేస్తూ తెలుగు సినిమా స్టాండర్డ్స్ ని అంతకంతకు చెడగొడుతున్నారు అనే వార్తలైతే వస్తున్నాయి… వీళ్ళు ముగ్గురు చేసే కమర్షియల్ సినిమాల ద్వారా బీ,సీ సెంటర్లోని ప్రేక్షకులు ఎంటర్టైన్ అవుతున్నారు.
కానీ వాళ్లను టార్గెట్ చేసుకొని సినిమా చేయడం వల్ల ఇండస్ట్రీకి వచ్చే లాభం ఏమీ లేదని పైగా తెలుగు సినిమా ఇండస్ట్రీ పరిధి పెరుగుతున్నప్పుడు వీళ్ళు ఇలాంటి సినిమాలు చేయడం వల్ల మనల్ని మనం తక్కువ చేసుకున్నట్టుగా అవుతుంది అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక రీసెంట్ గా మన శంకర వరప్రసాద్ సినిమాతో సక్సెస్ ని సాధించిన అనిల్ రావిపూడి మరోసారి తన రొటీన్ రొట్ట ఫార్ములా లోనే సినిమాని చేశాడు అనే విమర్శలైతే మూటగట్టుకుంటున్నాడు…
ఇదంతా చూసిన మరి కొంతమంది సినిమా మేధావులు మాత్రం భారీ బడ్జెట్ తో సినిమాలు చేసిన విజువల్ వండర్ గా తెరకెక్కించిన ఏది చేసిన కూడా ఆ సినిమా ప్రేక్షకుడికి నచ్చాలి. అప్పుడే సినిమా సక్సెస్ అవుతుంది. కమర్షియల్ సినిమాలు ప్రేక్షకులకు నచ్చుతున్నాయి. భారీ కలెక్షన్స్ ను వసూలు చేస్తున్నాయి. కాబట్టి ఆ సినిమాలను మనం తక్కువ చేసి మాట్లాడడం సరైనది కాదు అనే ధోరణిలో మాట్లాడేవారు కూడా ఉన్నారు…