
మెగా బ్రదర్ గా నాగబాబుకి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉన్నప్పటికీ. ఆయనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోలేకపోయాడు నాగబాబు. పైగా నిర్మాతగా అపజయాల భారిన పడి ఆస్తులు పోగోకుట్టుని అప్పుల రొంపలో చిక్కుకుని నలిగిపోతున్న సమయంలో.. జబర్దస్త్ అనే షో నాగబాబుకి గొప్ప ఆర్ధిక ఊరటని ఇచ్చింది. కేవలం జబర్దస్త్ షో వల్లనే నాగబాబు మళ్ళీ నిలబడకలిగాడు. కష్టాల్లో కూరుకుపోయి ఉన్న తనకు జబర్దస్త్ ఊపిరిపోసిందని ఆ మధ్య స్వయంగా నాగబాబునే చెప్పుకోచ్చారు. అయితే ఆ తరువాత జబర్దస్త్‌ను వీడుతూ నాగబాబు చేసిన కామెంట్స్, ఆరోపణలు ఎంతగా వివాదాన్ని సృష్టించాయో అందరికీ తెలిసిన విషయమే. పైగా జబర్దస్త్ షోకి పోటిగా.. ఆదరింది అనే షోను మొదలు పెట్టి.. జబర్దస్త్ నిర్మాతలతో ఆ వైర్యాన్ని మరింతగా ముందుకు తీసుకుపోయాడు.
Also Read : బిగ్ బాస్ 4 : హౌస్ లో నోయల్ క్రష్ తనే…?
కానీ, జబర్దస్త్ షోలా, నాగబాబు అదిరింది షో సక్సెస్ కాలేకపోతుంది. అదిరింది షోను లేపేందుకు నాగబాబు శాయశక్తులా ప్రయత్నిస్తున్నా.. సరైన విషయం ఉన్న స్కిట్స్ పడట్లేదు. దాంతో నాగబాబు ఎంత చేస్తున్నా జబర్దస్త్‌కు మాత్రం పోటీగా అదిరింది షో నిలబడలేక చేతులెత్తేస్తోంది. అయితే నాగబాబు తాజాగా నెటిజన్లు కామెంట్లకు బదులిచ్చాడు. ఈ క్రమంలోనే జబర్దస్త్ కు సంబంధించిన కొన్ని ప్రశ్నలను లేవనెత్తారు నెటిజన్లు. ఓ అభిమాని కామెంట్ చేస్తూ జబర్దస్త్‌లో మీ నవ్వుల్ని మిస్ అవుతున్నాము.. మళ్లీ జబర్దస్త్‌లోకి వస్తారా? అని ప్రశ్నించాడు.
ఈ కామెంట్ కు నాగబాబు స్పందిస్తూ.. ‘అలాంటి నవ్వులు అదిరింది షోలో కూడా ఉంటాయి. ఆదివారం రాత్రి 9 గంటలకు షో వస్తుంది అంటూ నాగబాబు కూల్ గా రిప్లై ఇచ్చాడు. ఏమైనా జబర్దస్త్‌లో నాగబాబు నవ్వులు బాగా ఫేమస్ అయ్యాయి. ఆ మధ్య నాగబాబును లాఫింగ్ స్టార్ అని కూడా అభిమానులు పిలుచుకునేవారు. అన్నట్టు పవన్ కళ్యాణ్ పాత ఫోటోలను షేర్ చేశాడు నాగబాబు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
Also Read : ‘పొలిటీషియన్’తో ఫారెన్ టూర్ వేసిన హీరోయిన్?