Vishwambhara Movie Release: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘ఇంద్ర’, ‘ఠాగూర్’ వంటి సంచలనాత్మక విజయాల తర్వాత ఆయన నుండి విడుదలైన ‘అంజి’ చిత్రం ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కారణం ఆ సినిమా ఎప్పుడో ‘చూడాలని ఉంది’ చిత్రం కంటే ముందే మొదలైంది. షూటింగ్ కార్యక్రమాలు సగం పూర్తి అయిన తర్వాత బడ్జెట్ లోపం ఉండడంతో మధ్యలో ఆగిపోయింది. మళ్లీ షూటింగ్ ని తిరిగి ప్రారంభించి, 2004 వ సంవత్సరం లో విడుదల చేశారు. ఎప్పుడో 1999 వ సమ్వత్సరం లో మొదలైన సినిమాని, 2004 లో విడుదల చేశారంటేనే అర్థం చేసుకోండి, సినిమా ఎంత ఆలస్యమైందో. అలాంటి సినిమానే ఈమధ్య కాలం లో ‘హరి హర వీరమల్లు’ రూపం లో వచ్చింది. ఎప్పుడో 2019 లో మొదలైన ఈ సినిమా, 2024 లో విడుదలైంది. ఫలితం కూడా అదే రిపీట్ అయ్యింది.
ఇప్పుడు ‘విశ్వంభర'(Vishwambhara Movie) మూవీ విషయంలో కూడా అభిమానుల్లో ఇదే భయం మొదలండి. 2023 వ సంవత్సరం లో మొదలైన ఈ సినిమా షూటింగ్, 2024 కి పూర్తి అయ్యింది. కానీ ఈ సినిమా టీజర్ విడుదల తర్వాత గ్రాఫిక్స్ మీద విపరీతమైన ట్రోల్స్ ఎదురు అవ్వడంతో, గ్రాఫిక్స్ పై రీ వర్క్ కోసం సినిమా వాయిదా వేశారు. అలా వాయిదా వేసి రెండేళ్లు పూర్తి అయ్యింది. ఇప్పటికీ ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనే దానిపై క్లారిటీ లేదు. రీసెంట్ గానే మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కట్ ని రెడీ చేసి, బిజినెస్ కోసం ఇద్దరు ముగ్గురు బయ్యర్స్ కి చూపించారు. వాళ్లకు చాలా బాగా నచ్చింది. కానీ నిర్మాతలు అడిగినంత డబ్బులు మాత్రం ఇవ్వడానికి సిద్ధం గా లేరు. ఆ ట్రైలర్ సోషల్ మీడియా లో విడుదలై, ఆడియన్స్ రెస్పాన్స్ చూసిన తర్వాత డీల్స్ పెట్టుకుంటామని అంటున్నారట.
మరోపక్క ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించలేని పరిస్థితి. ఎందుకంటే ఓటీటీ డీల్ ఇంకా పూర్తి అవ్వలేదు. ఓటీటీ డీల్ పూర్తి అవ్వాలంటే ముందు సినిమా రెడీ గా ఉండాలి. ఫస్ట్ కాపీ ని సిద్ధం చెయ్యాలి. ఈ చిత్రానికి సంబంధించిన VFX వర్క్ కేవలం 80 శాతం మాత్రమే పూర్తి అయ్యింది. ఇంకా 20 శాతం VFX వర్క్ పెండింగ్ లోనే ఉంది. ఇదే ఇంత పెండింగ్ లో ఉన్నప్పుడు, ఇక ఫస్ట్ కాపీ ని ఎప్పుడు రెడీ చెయ్యాలి , సినిమాని ఎప్పుడు విడుదల చెయ్యాలి?. ఈ ఏడాది సమ్మర్ కి ఈ చిత్రం వస్తుందని అంతా అనుకున్నారు. కానీ సమ్మర్ కి వచ్చే అవకాశాలు పూర్తిగా పోయినట్టే. మరి ఓటీటీ డీల్ ముగించుకొని, ఈ చిత్రం విడుదల తేదీని ఎప్పుడు లాక్ చేసుకుంటుందో చూడాలి.