Crazy Heroes: కొంత మంది హీరోలు ఎన్ని సినిమాలు చేసినా గుర్తింపు రాదు. కానీ ఒకే ఒక్క సినిమాతో మంచి గుర్తింపు సంపాదిస్తారు. కానీ కొందరు ఒకే సినిమాతో ఇండస్ట్రీకి దూరం అవుతారు. కొందరు మాత్రం వంద సినిమాలు చేస్తారు. అయితే హీరోలకంటే కమెడియన్లు ఎక్కువ సినిమాలు చేస్తుంటారు. అంతేకాదు వారు వందలకు వందలు సినిమాలు తీసేవారు. ఒకప్పుడు 100, 200 సినిమాలు తీసిన హీరోలు కూడా ఉన్నారు. మరి ఇలా ఈ కాలంలో వంద సినిమాలు చేసే సత్తా ఉన్నా హీరోలు ఎవరో ఓసారి చూసేద్దాం..
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా హిందీ మలయాళం కన్నడ చాలా భాషల్లో 100 కు పైగా సినిమాలు తీసిన హీరోలు చాలా మంది ఉన్నారు. ఉదాహరణకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ లు వందకు పైగా సినిమాల్లో నటించి సూపర్ హిట్ లను సొంతం చేసుకున్నారు. చిరంజీవి ఇప్పటికీ 150 కి పైగా సినిమాలు చేయగా బాలయ్య బాబు 100కు పైగా సినిమాలను తెరకెక్కించారు. ఇకపోతే ప్రస్తుత రోజుల్లో హీరోలు చాలా తక్కువ సినిమాలు మాత్రమే తీస్తున్నారు. రెండు సంవత్సరాలకు ఒక సినిమాను విడుదల చేస్తున్నారు.
ఈ జనరేషన్ హీరోల్లో కూడా తప్పకుండా కెరీర్ క్లోజ్ అయ్యేవరకు వంద సినిమాల్లో నటించే హీరోలు కూడా ఉన్నారు. అందులో ధనుష్ ముందు వరుసలో ఉన్నారు. ఇప్పటికే 50కి పైగా సినిమాల్లో నటించిన ధనుష్ ఈజీగానే 100 సినిమాలు దాటేస్తారనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. సంవత్సరానికి రెండు మూడు సినిమాలు విడుదల చేస్తూ ఫుల్ బిజీలో ఉన్నారు. ఈ రేంజ్ లో వంద సినిమాలు తెరకెక్కించడం కష్టం కాదంటున్నారు. ఇక మరొక హీరో దుల్కర్ సల్మాన్. వరుస సినిమాలు చేస్తూ దూసుకొని పోతున్న ఈ హీరో ఇప్పటికే 30కి పైగా సినిమాల్లో నటించారు.
ఒకే సంవత్సరంలో 8సినిమాలు విడుదల చేసిన ఘనత హీరో నరేష్ దే అని చెప్పవచ్చు. ఇప్పటికే 60పైగా సినిమాలలో నటించిన హీరో నరేష్ మిగిలిన 40 సినిమాలు కూడా పూర్తి చేస్తాడు అంటున్నారు అభిమానులు. అలాగే సలార్ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ కూడా ఇప్పటికే వంద సినిమాలు పూర్తి చేశారు. 28 ఏళ్ల సినిమా కెరియర్లో 100 సినిమాలను పూర్తి చేయడం అన్నది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి.