Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 ‘ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ఫైర్, వైల్డ్ ఫైర్ గా మారీ రికార్డ్స్ ని ఏ రేంజ్ లో తగలబెట్టేసిందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. సినిమా విడుదలై 12 రోజులు పూర్తి అయ్యింది. కానీ కొంతమంది స్టార్ హీరోలకు మొదటి రోజు వచ్చే వసూళ్లు , పుష్ప 2 కి 12వ రోజున వచ్చింది. దీనిని బట్టీ ఈ చిత్రం ఏ రేంజ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అనేది మీరే అర్థం చేసుకోండి. హిందీ వెర్షన్ తో పోల్చి చూస్తే, తెలుగు వెర్షన్ వసూళ్లు చాలా తక్కువగానే వస్తున్నాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. హిందీ లో నిన్న ఒక్క రోజే 35 కోట్ల రూపాయిలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట. పని దినాల్లో ఒక సినిమాకి బాలీవుడ్ లో ఈ రేంజ్ వసూళ్లు రావడం కేవలం ఈ సినిమాకే చూస్తున్నామని ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసారు.
ప్రస్తుతం బుక్ మై షో టికెట్ పోర్టల్ యాప్ లో ఈ సినిమాకి గంటకి 20 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. ఈరోజు దాటితే , ఈ చిత్రానికి ఇప్పటి వరకు 16 మిలియన్ల టిక్కెట్లు బుక్ మై షో యాప్ ద్వారా అమ్ముడుపోయినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. ఇంత అద్భుతంగా ఆడుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ విడుదల తేదీ ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసింది. వాళ్ళ తో కుదిరించుకున్న ఒప్పందం ప్రకారం, ఈ సినిమాని జనవరి 14వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్.
అంతే కాదు, సినిమా రన్ టైం ని దృష్టిలో పెట్టుకొని, అనేక సన్నివేశాలను సినిమా నుండి తొలగించేశారట. అందులో ఒక పాట కూడా ఉందని టాక్. ఇవన్నీ ఓటీటీ వెర్షన్ లో కలిపి విడుదల చేస్తారని టాక్ వినిపిస్తుంది. ఇదే కనుక నిజమైతే నెట్ ఫ్లిక్స్ లో ఉన్న రికార్డ్స్ మొత్తం బద్దలైనట్టే అని చెప్పొచ్చు. #RRR చిత్రం నెట్ ఫ్లిక్స్ లో ఏడాది వరకు టాప్ 10 లో ట్రెండ్ అయ్యింది. ఈ రికార్డుని ఇప్పటి వరకు ఎవ్వరూ ముట్టుకోలేదు. పుష్ప 2 చిత్రం ఆ రికార్డు ని అందుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. తెలుగు, హిందీ మరియు ఇతర ప్రాంతీయ భాషలతో పాటు, ఇంగ్లీష్ ఆడియో లో కూడా ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లోకి అందుబాటులో రాబోతుందట. మరి థియేటర్స్ లో ఈ రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా, ఓటీటీ ఆడియన్స్ నుండి కూడా అదే రేంజ్ రెస్పాన్స్ ని దక్కించుకుంటుందా లేదా అనేది చూడాలి.