https://oktelugu.com/

Swiggy & Zomato : కస్టమర్లకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన స్విగ్గీ, జొమాటో.. ఫుడ్‌ ఆర్డర్‌ చార్జీల సవరణ.. అమలు ఎప్పటి నుంచంటే..!

పని ఒత్తిడుల కారణంగా ఇళ్లలో వంట చేసేవారు తగ్గిపోతున్నారు. చాలా మంది ఆన్‌లైన్‌లోనే ఫుడ్‌ ఆర్డర్‌ చేసి తింటున్నారు. దీంతో ఈ కామర్స్‌ సంస్థలకు డిమాండ్‌ పెరుగుతోంది. స్విగ్గీ, జొమాటో టాప్‌లో ఉన్నాయి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 17, 2024 / 05:05 PM IST

    Swiggy & Zomato

    Follow us on

    Swiggy & Zomato :  కుటుంబ సభ్యుల కోసం ఇల్లాలు వంట చేస్తారు. సభ్యుల అభిరుచి మేరకు వంటకాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి, పండుగలు సందర్భంగా ప్రత్యేక వంటకాలు ఉంటాయి. అయితే.. ఇప్పుడు వంట చేసేవారు తగ్గిపోతున్నారు. చాలా ఇళ్లలో సాయంత్రం పొయ్యి వెలగడం లేదు. దంపతులు జాబ్‌ చేస్తుండడం, పని ఒత్తిడి కారణంగా వంట చేసే తీరిక దొరకడం లేదు. కొందరు రోజుకో వెరైటీ కోసం ఇంట్లో వంట చేయకుండా బయటి తిండికి అలవాటు పడుతున్నారు. చాలా మంది ఇంటి ఫుడ్‌ కన్నా బయటి ఫుడ్‌నే ఇష్టపడుతున్నారు. దీనినే క్యాష్‌ చేసుకుంటున్నాయి ఈ కామర్స్‌ సంస్థలు స్విగ్గీ, జొమాటోతోపాటు అనేక సంస్థలు. ఆర్డర్‌ ఇస్తే చాలు ఎక్కడి కావాలంటే అక్కడికి ఫుడ్‌ డెలివరీ చేస్తున్నాయి. దీంతో నట్టింట్లో కూర్చుని విభిన్న రుచులు తినే అవకావం ఉండడంతో చాలా మంది ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తున్నారు. స్విగ్గీ, జొమాటో ఫుడ్‌ డెలివరీలో అగ్రస్తానంలో ఉన్నాయి. అయితే ఫుడ్‌ డెలివరీకి ఈ సంస్థలు చార్జీ వసూలు చేస్తాయి. అయినా ఆర్డర్లు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. స్పెషల్‌ డేస్‌లలో మరింత డిమాండ్‌ ఉంటుంది. కొన్ని ఏళ్లుగా డెలివరీ చార్జీలు పెంచుతున్నాయి. దీంతో కస్టమర్లు ఫుడ్‌ చార్జీ కన్నా.. డెలివరీ చార్జీలే పెరగడంతో ఆర్డర్లు తగ్గుతున్నాయి.

    చార్జీల సవరణ..
    కష్టమర్ల బాధను అర్థం చేసుకున్న దిగ్గజ ఈ కామర్స్‌ ంస్థలు స్విగ్గీ, జొమాటో చార్జీలు సవరించాలని నిర్ణయించాయి. ప్రస్తుతం ఈ కమార్స్‌ సంస్థలు 18 శాతం గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తున్నాయి. ఈ చార్జీలను 5 శాతం తగ్గించేందుకు స్విగ్గి, జొమాటో నిర్ణయించాయి. ఈమేరకు ప్రణాళిక రచిస్తున్నాయి. చార్జీలు తగ్గితే ఆర్డర్లు పెరుగుతాయని సంస్థలు భావిస్తున్నాయి. ఫిట్‌మెంట్‌ కమిటీ సూచన మేరకు 2025, జనవరి 1 నుంచి చార్జీలు మారతాయని తెలుస్తోంది.

    పోటీ కూడా కారణమే..
    స్విగీ, జొమాటో చార్జీలు తగ్గించడానికి ఫుడ్‌ డెలివరీ రంగంలో పెరుగుతున్న పోటీ కూడా కారణమని తెలుస్తోంది. వినియోగదారులకు ప్రయోజనకరమైన ధరలు అందించడమే లక్ష్యంగా చార్జీలను సవరించినట్లు సమాచారం. ఆర్‌బీఐ నిబంధనలు కూడా చార్జీల సవరణకు మరో కారణం. క్రెడిట్‌ లెక్కింపు విధానం అమలు చేసే అవకాశం కూడా ఉందని సమచారాం. దీంతో ఈ రంగంలో వినియోగదారులకు మరింత లబ్ధి కలుగుతుందని తెలుస్తోంది.