Prabhas : ప్రభాస్ స్టార్ డమ్ ను వాడుకుంటున్న హీరోలు…

అయితే ఈ సినిమా కనక బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధిస్తే మాత్రం ప్రభాస్ రేంజ్ మరింత పెరిగిపోతుందని చెప్పడంలోకి ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటికే ప్రభాస్ రేంజ్ లో స్టార్ డమ్ ను అందుకోవడం ఎవరి వల్ల కావడం లేదు. మరి ఈ సినిమాతో కూడా భారీ హిట్టు కొడితే మాత్రం ఇక ఆకాశమే హద్దుగా ప్రభాస్ చేలరేగిపోతాడనే చెప్పాలి...

Written By: NARESH, Updated On : May 16, 2024 9:36 pm

Manchu vishnu and Naveen Polishetty are the heroes who are using Prabhas' stardom

Follow us on

Prabhas : యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు ప్రభాస్…బాహుబలి సినిమాతో ఈయన పాన్ ఇండియా లో స్టార్ హీరో గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు నైతే ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే కొంతమంది హీరోలు ప్రభాస్ స్టార్ డమ్ ను వాడుకొని సక్సెస్ లు కొడుతున్నారు. ఇక ప్రస్తుతం కొందరు సక్సెస్ లు కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు.అందులో మొదటగా చెప్పుకోవాల్సింది మంచు విష్ణు గురించి…

ఆయన చేస్తున్న కన్నప్ప సినిమాలో ప్రభాస్ ని కీలకమైన పాత్రలో నటింపజేసి తన ద్వారా పాన్ ఇండియాలో ఈ సినిమాకి భారీ రేంజ్ లో పబ్లిసిటీ క్రియేట్ చేసుకొని, భారీ సక్సెస్ సాధించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక మొత్తానికైతే ప్రభాస్ మంచు విష్ణు కోసం అ క్యారెక్టర్ ఎలాంటిదైనా సరే నటించడానికి తను సిద్ధంగా ఉన్నానని చెప్పి సినిమా సెట్స్ లో పాల్గొన్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇంతకు ముందు కూడా జాతి రత్నాలు సినిమా టైంలో ప్రభాస్ ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో ఎక్కువగా పాల్గొనడం వల్లే ఆ సినిమా సూపర్ హిట్ అయింది.

దాని ద్వారానే నవీన్ పోలిశెట్టి ఇండస్ట్రీ లో హీరోగా సెట్ అయ్యాడు. ఇక ఇదిలా ఉంటే ఆ తర్వాత చేసిన “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” సినిమా విషయంలో కూడా ప్రభాస్ చాలా వరకు ప్రమోషన్స్ అయితే నిర్వహించాడు. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఇంక మొత్తానికైతే నవీన్ పోలిశెట్టి స్టార్ హీరో అవడంలో ప్రభాస్ కీలకపాత్ర వహించాడనే చెప్పాలి… ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమాని రిలీజ్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు.

అయితే ఈ సినిమా కనక బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధిస్తే మాత్రం ప్రభాస్ రేంజ్ మరింత పెరిగిపోతుందని చెప్పడంలోకి ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటికే ప్రభాస్ రేంజ్ లో స్టార్ డమ్ ను అందుకోవడం ఎవరి వల్ల కావడం లేదు. మరి ఈ సినిమాతో కూడా భారీ హిట్టు కొడితే మాత్రం ఇక ఆకాశమే హద్దుగా ప్రభాస్ చేలరేగిపోతాడనే చెప్పాలి…