Sukumar Disciples: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంటలిజెంట్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్(Sukumar)… తన ఎంటైర్ కెరియర్ లో చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి వాటితో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆయన ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. మరి ఇలాంటి క్రమంలోనే ఆయన గొప్ప దర్శకుడిగా పేరు సంపాదించుకొని ఇండియాలోనే టాప్ 3 డైరెక్టర్లలో ఒకడిగా ఎదిగాడు. పుష్ప 2 (Pushpa 2) సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేశాడనే చెప్పాలి. మరి అలాంటి దర్శకుడు ఆయన చేసిన సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లు గా పని చేసిన వ్యక్తులు కొంతమంది ఇటీవల దర్శకులుగా మారారు… వాళ్ళు చేసిన మొదటి సినిమాలతోనే మంచి సక్సెస్ లను సాధించడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకంటు ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నారు. ముఖ్యంగా ‘ఉప్పెన’ (Uppena) సినిమాతో బుచ్చిబాబు (Buchhibabu) దర్శకుడిగా మారి మంచి విజయాన్ని అందుకున్నాడు. మొదటి సినిమాతోనే వంద కోట్ల కలెక్షన్స్ ను రాబట్టిన దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు. ఇక ఈయనతో పాటుగా శ్రీకాంత్ ఓదెల సైతం దసర సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ఐడెంటిటిని ఏర్పాటు చేసుకొని ప్రస్తుతం ‘ప్యారడైజ్’ (Paradaise) అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాతో ఆయనకంటూ ఒక సెపరేట్ క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు. తద్వారా ఆయనకంటూ ఒక గొప్ప ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఇప్పుడు చూస్తుంటే ఈ ఇద్దరు దర్శకులు సైతం సుకుమార్ రేంజ్ లో పాన్ ఇండియాలో తమ సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read: హరిహర వీరమల్లు ఇంటర్వెల్ ఎపిసోడ్ లో భారీ ట్విస్ట్ ఉంటుందా..?
ఇక ఇదంతా చూస్తున్న కొంతమంది సినిమా మేధావులు సైతం వీళ్లిద్దరూ సుకుమార్ ను మించిన మాస్ డైరెక్టర్లుగా మారబోతున్నారు అంటూ కొన్ని అభిప్రాయాలనైతే వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా సుకుమార్ నుంచి వచ్చిన దర్శకులు స్టార్ డైరెక్టర్లుగా ఎదుగుతూ ఉండడం ఆయనకు గర్వకారణమనే చెప్పాలి.
ఇక మిగతా స్టార్ డైరెక్టర్స్ నుంచి వచ్చిన ఏ దర్శకులు సైతం స్టార్ డైరెక్టర్ గా మారడం లేదు. ప్రస్తుతం ఉన్న రోజుల్లో అయితే అది అసాధ్యమనే చెప్పాలి…కేవలం సుకుమార్ శిష్యులు మాత్రమే టాప్ డైరెక్టర్లుగా ఎదుగుతున్నారు. వారికి మాత్రమే ఇది చెల్లిందని చెప్పాలి. ఎందుకంటే సుకుమార్ దగ్గర దర్శకత్వ విభాగంలో పనిచేసే చాలా మంది కుర్రాళ్లను ఆయన తన కథలో లీనం చేస్తాడు…
సినిమా కథని ఎలా రాయాలి అనేదాని మీద మంచి గ్రిప్ సంపాదించుకుంటారు. ఎందుకంటే సుకుమార్ అందరితో డిస్కషన్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన దగ్గర ఉన్న టీమ్ అందరు చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన నుంచి వచ్చిన దర్శకులు స్టార్ డైరెక్టర్లుగా ఎదుగుతున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…