Harihara Veeramallu Interval Episode: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన చాలా సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును తీసుకురావడమే కాకుండా మంచి విజయాలను సాధించాయి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఆయన సినిమాలను చేయడం లేదు. ప్రస్తుతం పాలిటిక్స్ లో బిజీగా ఉంటున్న ఆయన అడపాదడపా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. 2024 వ సంవత్సరములో జరిగిన ఎలక్షన్స్ కి ముందు కమిట్ అయిన సినిమాలను ఇప్పుడు పూర్తి చేసే పనిలో పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే హరిహర వీరమల్లు(Harihara Veeramallu) సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేయడమే కాకుండా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని ఫినిష్ చేసుకొని ఈనెల 24వ తేదీన ప్రేక్షకులు ముందుకు రాబోతోంది…మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. తద్వారా ఆయన స్టార్ డమ్ అనేది ఇంకా విస్తరిస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ దక్కనటువంటి గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్న హీరో కూడా తనే కావడం విశేషం…మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ ను సైతం పక్కకు నెట్టేసి తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని సంపాదించుకున్న నటుడు కూడా తనే కావడం విశేషం…
Also Read: మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా.. మన రవీంద్ర జడేజా కు లార్డ్సే కాదు..మనమూ లేచి నిలబడి చప్పట్లు కొట్టాల్సిందే!
ఇక ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న ఆయన హరిహర వీరమల్లు సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించి సూపర్ సక్సెస్ ని సాధించడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు…అయితే రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ రిపోర్టు కూడా వచ్చేసింది. సెన్సార్ బోర్డు వాళ్ళు ఈ సినిమాకి యూ బై ఏ సర్టిఫికెట్ ను అయితే ఇచ్చారు.
ఇక వాళ్ల నుంచి వస్తున్న టాక్ ను బట్టి చూస్తుంటే ఈ సినిమా ఇంటర్వెల్ లో ఒక భారీ ట్విస్ట్ అయితే రివిల్ చేయబోతున్నారట…దానివల్ల సినిమా మొత్తానికి హైప్ రావడమే కాకుండా సెకండ్ హాఫ్ మొత్తం ఆ ట్విస్ట్ మీద బేస్ చేసుకొని సినిమా నడవబోతున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మరోసారి తన స్టార్ డమ్ ను ఎలివేట్ చేసుకుంటారని చాలామంది సినిమా మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇక బాలీవుడ్లో సైతం తను పాగా వేయబోతున్నాడు అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తూ ఉండడం విశేషం…మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను ఇస్తుంది అనేది తెలియాలంటే మాత్రం మరో 10 రోజులు వెయిట్ చేయాల్సిందే…