Shankar
Shankar : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట వాళ్ళు చేయబోయే సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధించే దిశగా ముందుకు సాగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇక ఇప్పుడు మన స్టార్ హీరోలందరు పాన్ ఇండియా మార్కెట్ ను బేస్ చేసుకొని ముందుకు సాగడం విశేషం..
తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు శంకర్(Shankar)…ప్రస్తుతం తనదైన రీతిలో ఆయన సినిమాలు చేస్తున్నప్పటికి అవేవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదు. కారణం ఏదైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో మాత్రమే చాలా వరకు వెనుకబడిపోయాడనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలో ఇకమీదట ఆయన చేయబోయే సినిమాలు యావత్ ప్రేక్షకులను అలరించాలి అంటే మాత్రం ఆయన కథలో వైవిధ్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఏది ఏమైనా కూడా ఆయనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకున్న శంకర్ ఇకమీదట కూడా ఇలాంటి సినిమాలనే తీస్తే మాత్రం ఆయన ఫేడౌట్ అయిపోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఇక ఇప్పటికే గేమ్ చేంజర్ (Game Changer)సినిమాతో భారీ డిజాస్టర్ ను మూటగట్టుకున్న ఆయన గత పది సంవత్సరాల నుంచి ఒక్క సూపర్ సక్సెస్ ని కూడా తీయలేకపోతున్నాడు. ఇక ఇప్పుడు కమలహాసన్ తో భారతీయుడు 3 సినిమాని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో తనను తాను మరో సారి చేసుకుంటానని శంకర్ గట్టిగా చెబుతున్నప్పటికి చాలామందికి శంకర్ మీద నమ్మకం అయితే పోయింది.
ఎందుకంటే ముందుగా ఆయన కథ రాసుకునే విధానం ప్రేక్షకులకు నచ్చలేదు. కథ కనక ప్రేక్షకులను ఎంగేజ్ చేసినట్లయితే ఆయన విజువల్ గా మంచి గుర్తింపును సంపాదించుకోవడానికి ఆయన ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. మరి అలాంటి శంకర్ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నాడు. ఆయన సాధించాల్సిన సక్సెస్ ఎందుకు సాధించలేకపోతున్నాడు.
ఇప్పుడు కనక సూపర్ సక్సెస్ ని సాధిస్తే కమల్ హాసన్ కి మరోసారి మంచి విజయాన్ని అందించిన వాడవుతాడు. ఇక 2024వ సంవత్సరంలో వచ్చిన ‘భారతీయుడు 2’ (Bharathiyudu 2)సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో ఆ సినిమాకి భారీగా నష్టాలైతే వచ్చాయి. ఇక ప్రొడ్యూసర్స్ మరొక సినిమా చేసి తమ నష్టాన్ని పూడ్చాలని శంకర్ ని భారీగా డిమాండ్ చేస్తున్నారు. దానివల్లే ఆయన ‘భారతీయుడు 3′(Bharathiyudu 3) సినిమాని పట్టాలెక్కించి కొద్ది వరకు ఆ భారాన్ని తీర్చే ప్రయత్నమైతే చేస్తున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఈ సినిమా కోసం సరికొత్త టెక్నాలజీ ని కూడా వాడుతున్నట్టుగా తెలుస్తోంది…
మరి ఈ సినిమాతో అయిన శంకర్ విజయాల బాట పట్టి ఒకప్పటి శంకర్ ని బయటికి తీస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ సినిమాతో భారీ డిజాస్టర్ ను మూటగట్టుకున్న రామ్ చరణ్ సైతం తన తదుపరి సినిమాతో మంచి విజయాన్ని సాధించడానికి కసరత్తులు చేస్తున్నాడు…