https://oktelugu.com/

Singham Again: సింగం ఎగైన్ తో రోహిత్ శెట్టి సక్సెస్ కొట్టి బాలీవుడ్ హవా ను పెంచుతాడా..?

అజయ్ దేవగన్, రోహిత్ శెట్టిల కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధిస్తుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.

Written By:
  • Neelambaram
  • , Updated On : May 9, 2024 / 01:50 PM IST

    Singham-Again

    Follow us on

    Singham Again: బాలీవుడ్ ఇండస్ట్రీలో రోహిత్ శెట్టి కమర్షియల్ డైరెక్టర్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపును అయితే సంపాదించుకున్నాడు. ఇక ఇప్పటికే ఆయన చేసిన చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. ఇప్పుడు ఆయన సింగం సిరీస్ లో భాగంగా ఇప్పటికే సింగం, సింగం రిటర్న్స్ లాంటి సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్నాడు. ఇక ఇప్పుడు దాంతోపాటుగా “సింగం ఎగైన్” అనే మరొక సినిమాను కూడా తెరకెక్కించాడు.

    ఇక అందులో భాగంగానే అక్షయ్ కుమార్ రన్వీర్ సింగ్, దీపికా పదుకొనే, కరీనా కపూర్ లాంటి స్టార్ కాస్టింగ్ తో ఈ సినిమాని తెరకెక్కించినప్పటికీ ఈ సినిమా విజయాన్ని సాధిస్తేనే బాలీవుడ్ ఇండస్ట్రీ అనేది మరొకసారి ముందడుగు వేస్తుంది. లేకపోతే మాత్రం ఇప్పటివరకు సౌత్ సినిమాలా డామినేషన్ తోనే కొనసాగుతున్న బాలీవుడ్ మళ్ళీ అలానే ఉండాల్సి వస్తుంది. ఇక షారుక్ ఖాన్ నటించిన జవాన్, పఠాన్ రెండు సినిమాలను మినహాయిస్తే గత నాలుగు సంవత్సరాల నుంచి అక్కడ భారీ సక్సెస్ ఒకటి కూడా దక్కడం లేదు.

    మరి ఇలాంటి క్రమంలో అజయ్ దేవగన్, రోహిత్ శెట్టిల కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధిస్తుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. అయితే ఈ సినిమాతో కనక సక్సెస్ ని సాధిస్తే రోహిత్ శెట్టి మరోసారి స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు పొందుతాడు. ఎందుకంటే ఇంతకుముందు ఆయన చేసిన సినిమాలు ఏవి కూడా అంత మంచి విజయాలను అందుకోలేకపోతున్నాయి.

    కాబట్టి ఇప్పుడు తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. చూడాలి మరి ఈ సినిమాతో తను ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది… ఇంకా ఇప్పటికే ఖాన్ త్రయం అయిన షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి హీరోలు సైతం సౌత్ తాకడిని తట్టుకోవడం వాళ్ళ వల్ల కావడం లేదు. అలాంటిది అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ ల వల్ల అవుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి…