Bigg Boss 9 Telugu Ritu Chaudhary: మరికొద్ది గంటల్లోనే స్టార్ మా ఛానల్ లో బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) ప్రారంభం కాబోతుంది. ఈ సీజన్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ లిస్ట్ చాలా రోజుల క్రితమే బయటకు వచ్చింది. నిన్న గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యింది. కాబట్టి అక్కడి నుండి వచ్చిన సమాచారం ప్రకారం హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో ఒకరు రీతూ చౌదరి(Ritu Chowdary). పరిచయం అక్కర్లేని పేరు ఇది. సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో పాపులారిటీ ని సంపాదించిన రీతూ చౌదరి, టీవీ సీరియల్స్ లో లేడీ విలన్ గా నటించేది. హైపర్ ఆది జబర్దస్త్ లో స్కిట్స్ చేస్తున్నంత కాలం ఈమె కూడా ఆయన టీం లో కనిపించేది. అంతే కాదు స్టార్ మా ఛానల్ లో అనేక ఎంటర్టైన్మెంట్ షోస్ లో కనిపించేది.
రీసెంట్ గానే స్టార్ మా ఛానల్ లో ప్రతీ శని, ఆదివారాల్లో టెలికాస్ట్ అయిన ‘కూకూ విత్ జాతి రత్నాలు’ ప్రోగ్రాం లో పాల్గొనింది. ఇక ఈ ఏడాది ప్రారంభం లో ఈమె మాజీ భర్త చేసిన స్కాం లో ఈమె పేరు కూడా బలంగా వినిపించింది. రీతూ చౌదరి వేల కోట్ల స్కాం లో భాగం అయ్యిందని, టీవీ షోస్ చేసుకునే ఈమె పేరు మీద ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి అంటూ టీవీ చానెల్స్ లో ఈమె గురించి ప్రత్యేక కథనాలు కూడా ప్రసారం చేశారు. ఒక ఛానల్ పై ఈమె ఫైర్ అయ్యి, లైవ్ డిబేట్ లో కూర్చొని నా పై తప్పుడు ప్రచారాలు చేయొద్దు, అతనితో నేను విడిపోయి చాలా కాలం అయ్యింది అంటూ చెప్పుకొచ్చింది. చాలా బోల్డ్ గా మాట్లాడే అలవాటు ఉన్న రీతూ చౌదరి బిగ్ బాస్ రియాలిటీ షో కి పర్ఫెక్ట్ గా సరిపోతుంది.
ఈమె వాస్తవానికి సీజన్ 8 లోనే రావాల్సింది. కానీ తన స్నేహితురాలు విష్ణు ప్రియా కోసం తన ఛాన్స్ ని వదులుకుంది. ఇప్పుడు పాపం ఆమె చేతిలో అవకాశాలు లేవు. కెరీర్ చాలా డల్ గా కొనసాగుతుంది. ఒక ఇంటర్వ్యూ లో ఆమె ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురుకుంటుందో కూడా చెప్పుకొచ్చింది. సరైన సమయం లో సరైన అవకాశం వచ్చింది. దీనిని ఆమె ఎంత వరకు ఉపయోగించుకుంటుందో చూడాలి. అంతే కాదు రీతూ చౌదరి లవ్ ట్రాక్స్ నడపడం లో కూడా దిట్ట. కాబట్టి హౌస్ లో ఈమె కచ్చితంగా ఒక కంటెస్టెంట్ తో లవ్ ట్రాక్ నడిపే అవకాశాలు ఉన్నాయి. అయితే సోషల్ మీడియా లో శాంపిల్ గా పెట్టిన కొన్ని పోల్స్ లో రీతూ చౌదరి కి చాలా తక్కువ ఓటింగ్ ఉంది. హౌస్ లోకి వెళ్లిన తర్వాత ఈమె ఆట తీరుని బట్టి ఓటింగ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి.