Homeఎంటర్టైన్మెంట్Ramayan Movie : రణబీర్ సాయి పల్లవి సీతారాములుగా మెప్పిస్తారా? సినిమా ఎలా ఉండబోతోంది?

Ramayan Movie : రణబీర్ సాయి పల్లవి సీతారాములుగా మెప్పిస్తారా? సినిమా ఎలా ఉండబోతోంది?

Ramayan Movie : భారతీయ ఇతిహాసాల్లో రామాయణం ఒకటి. అద్భుతమైన సినిమాటిక్ సబ్జెక్ట్ కూడాను. హిందువుల ఆరాధ్య దైవం రాముని గాథ అయిన రామాయణం స్ఫూర్తిదాయకం. ప్రతి ఒక్కరు ఆచరించాల్సిన ధర్మ మార్గం. రామాయణం ఆధారంగా వందల చిత్రాలు తెరకెక్కాయి. జనరేషన్స్ మారినా, నాగరికత పెరిగినా… రామాయణం మీద సినిమాలు వస్తూనే ఉన్నాయి. రామాయణం టైటిల్ తో మరో భారీ ప్రాజెక్ట్ బాలీవుడ్ లో తెరకెక్కుతుంది. ఈసారి శ్రీరాముడి పాత్ర చేసే అదృష్టం రన్బీర్ కపూర్ కి దక్కింది. అనూహ్యంగా ఎందరో బాలీవుడ్ భామలను కాదని సీత పాత్ర సాయి పల్లవి ని వరించింది. సహజ నటిగా పేరుగాంచిన సాయి పల్లవి బాలీవుడ్ రామాయణంలో సీతగా నటిస్తుంది. ఆమెకు హోమ్లీ ఇమేజ్ ఉండటం కూడా ఇందుకు కారణం.

ఈ చిత్రం దాదాపు మూడు భాగాలుగా తెరకెక్కనుందని సమాచారం. నితేష్ కుమార్ దర్శకుడు. మరొక విశేషం ఏమిటంటే కెజిఎఫ్ స్టార్ యష్ సైతం రామాయణం చిత్రంలో నటిస్తున్నారు. ఆయన పాత్ర ఏమిటనేది రివీల్ చేయలేదు. యష్ ఈ చిత్ర నిర్మాణ భాగస్వామి కూడాను. కాగా రామాయణం ఆల్రెడీ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ క్రమంలో అనధికారికంగా రన్బీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్ అయ్యాయి. రామాయణం సెట్స్ నుండి శ్రీరాముడు, సీత లుక్స్ బయటకు వచ్చాయి.

ఈ క్రమంలో పోలికలు మొదలయ్యాయి. శ్రీరాముడు-సీత పాత్రలు చేయడం అదృష్టం. అదే సమయంలో బాధ్యత కూడాను. ఏమాత్రం పాత్రకు న్యాయం చేయకపోయినా విమర్శలు తప్పవు. దీనికి ఆదిపురుష్ మూవీ పెద్ద ఉదాహరణ. దర్శకుడు ఓం రౌత్ మోడరన్ రామాయణం తీయాలనే ప్రయత్నంలో అబాసుపాలయ్యాడు. ప్రధాన పాత్రలైన శ్రీరాముడు, రావణాసురుడు, సీత, హనుమంతుడు గెటప్స్ పై హిందూవాదులు మండిపడ్డారు. ముఖ్యంగా రావణుడు గెటప్, తన వాహనానికి మాంసం ఆహారంగా వేయడం వంటి సీన్స్ విమర్శలకు గురయ్యాయి.

రామాయణం ఆధారంగా తెరకెక్కిన చిత్రాల్లో లవకుశ గొప్ప చిత్రంగా ఉంది. రాముడిగా ఎన్టీఆర్, సీతగా అంజలి దేవి ఒక సెట్ చేశారు. వారిని మరొక జంట మైమరిపించలేకపోయారు. ఇక సాయి పల్లవి, రన్బీర్ కపూర్ విషయానికి వస్తే… లీకైన ఫోటోల్లో వారి లుక్స్ ఆకట్టుకున్నాయి. రన్బీర్ కపూర్ కి రాముడిగా పాస్ మార్క్స్ వేయవచ్చు. కాగా సీతగా సాయి పల్లవి అద్భుతంగా ఉంది. ఆమె రన్బీర్ కపూర్ ని డామినేట్ చేస్తుంది. ఇక సీతా రాములుగా పూర్తి స్థాయిలో సాయి పల్లవి-రన్బీర్ కపూర్ మెప్పిస్తారా? లేదా? అనేది సినిమా విడుదలయ్యాక మాత్రమే చెప్పగలం.

RELATED ARTICLES

Most Popular