Ram Charan to reprise Balakrishna role: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నందమూరి తారకరామారావు దగ్గర నుంచి ఇప్పుడున్న జూనియర్ ఎన్టీఆర్ వరకు ప్రతి ఒక్కరు వాళ్ళ సత్తాను చాటుకొని స్టార్ డమ్ ను సంపాదించుకున్న వాళ్లే కావడం విశేషం… ఇక ఇప్పటివరకు వాళ్ళు చేసిన సినిమాలు వాళ్ళను టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇక మీదట వాళ్ళు చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది…బాలయ్య బాబు తన ఎంటైర్ కెరియర్ లో ఎన్నో గొప్ప పాత్రలు చేశాడు.
ముఖ్యంగా ‘ఆదిత్య 369’ సినిమాలో కృష్ణదేవరాయలు పాత్రను పోషించిన బాలయ్య ఆ పాత్రకి సరిగ్గా సరిపోయాడు. నిజంగా కృష్ణదేవరాయలు ఉంటే ఇలానే ఉండేవాడేమో అనేంతలా ఆ పాత్రలో నటించి మెప్పించాడు. ఇక చాలా సంవత్సరాల తర్వాత బాలయ్య పోషించిన అదే పాత్రని రామ్ చరణ్ చేయబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి.
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఆయన చేస్తున్న సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉందట. అది కృష్ణదేవరాయలు పాత్ర కావడం విశేషం… ఈ సినిమాని హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఈ మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో నటించబోతున్నాడనే వార్తలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు చేసిన పాత్రని రామ్ చరణ్ చేయడం అనేది చాలామందిలో ఆసక్తిని కలిగిస్తుంది. నిజానికి ఆ పాత్రలో రామ్ చరణ్ ఎలా తన ప్రతిభను చూపిస్తాడు. అందరిని మెప్పించే విధంగా తన నటన ఉంటుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
మొత్తానికైతే రామ్ చరణ్ ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో చేసిన ‘పెద్ది’ సినిమా విషయంలో కూడా ఆయన చాలా కేర్ ఫుల్ గా వ్యవహరించాడు. మరో మూడు రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఈ సినిమా మీద అంచనాలైతే భారీగానే ఉన్నాయి…
