Pushpa 2: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కి ప్రత్యేకమైన గుర్తింపు అయితే ఉంది. ఇక ఆయన చేస్తున్న సినిమాలు కూడా ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఇక పుష్ప సినిమాతో ఆయన సాధించిన విజయం మామూలుది కాదు. దాంతో ఇప్పుడు పుష్ప 2 సినిమా మీద ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలైతే ఉన్నాయి.
ఇక ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాతో అల్లు అర్జున్ మరోసారి రాణిస్తాడా లేదా అనే అనుమానాలైతే వ్యక్తం అవుతున్నాయి.ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్,టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ సినిమా నుంచి మరికొన్ని సాంగ్స్, టీజర్స్, ట్రైలర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి వాటితో ఈ సినిమా మీద అంచనాలు తార స్థాయికి వెళ్ళిపోతాయి అనే చెప్పాలి. ఇక ఆగస్టు 15వ తేదీకి మహా అయితే ఇంకొక 45 రోజులు మాత్రమే మిగిలి ఉంది. మరి ఇలాంటి క్రమంలో ఇంకా పుష్ప 2 సినిమాకి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి కాలేదు.
ఇప్పటివరకు షూటింగ్ జరుపుకున్న దానికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నప్పటికీ దాంట్లో కూడా గ్రాఫిక్స్ వర్క్ కూడా బాగా ఉందట. ఇక దాంతో ఈ సినిమాని ఎప్పుడు షూట్ చేసి ఇంకెప్పుడు వర్క్ మొత్తం క్లియర్ కట్ గా పూర్తి చేస్తారు అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక పుష్ప 2 అనుకున్న సమయానికి వస్తుందా లేదా అనే అనుమానాలైతే వ్యక్తం అవుతున్నాయి. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఎడిటర్ తప్పకోవడంతో ఈ సినిమాకి భారీగా మైనస్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి.
ఇక మొత్తానికైతే సుకుమార్, అల్లు అర్జున్ అనుకున్న సమయానికి పుష్ప 2 సినిమాను థియేటర్లకు తెచ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక ఈ సినిమా అనుకున్న టైమ్ కి దిగితే పర్లేదు కానీ ఒకవేళ లేట్ అయితే మాత్రం అభిమానులు ఆగ్రహానికి గురవ్వక తప్పదు…