Prabhas Project K: ఆదిపురుష్ మూవీ థియేటర్స్ లో సందడి చేస్తుంది. మరో మూడు నెలల్లో సలార్ విడుదల కానుంది. సలార్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ దాహం తీర్చే చిత్రం అవుతుందని గట్టిగా నమ్ముతున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ సెప్టెంబర్ 28న విడుదల కానుంది. సలార్ థియేటర్స్ లోకి వచ్చిన మరో నాలుగు నెలల్లో ప్రాజెక్ట్ కే విడుదల కానుంది. ప్రభాస్ తో పాటు ఇండియా వైడ్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రమిది. దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక్కో అప్డేట్ తో అంచనాలు పెంచేస్తున్నాడు.
ప్రాజెక్ట్ కే అంటే ప్రాజెక్ట్ కృష్ణ అనే ప్రచారం జరుగుతుంది. శ్రీకృష్ణుడు ప్రస్తావనతో కూడిన సోషియో ఫాంటసీ చిత్రం అంటూ ప్రచారం జరుగుతుంది. ఆ మధ్య నిర్మాత అశ్వినీ దత్ సూచాయిగా హింట్ ఇచ్చాడు. ఈ మూవీలో పురాణాలు, దేవుళ్ళ ప్రస్తావన ఉందన్నారు. అలాగే బలమైన సెంటిమెంట్ తో మూవీ సాగుతుందన్నారు. మరోవైపు టైం ట్రావెల్ మూవీ అంటున్నారు. సైన్స్ ఫిక్షన్ జానర్ కూడా కావొచ్చు. ఈ మూవీలో ఉపయోగించే ప్రతి వస్తువు స్క్రాచ్ అనే టెక్నాలజీలో రూపొందిస్తున్నారు.
ఒక్క ట్రైర్ డిజైన్ చేయడానికి టీమ్ నెలల సమయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే ప్రాజెక్ట్ కే లో ప్రభాస్ లుక్ ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది. ఇంత వరకు ప్రభాస్ లుక్ బయటకు రాలేదు. యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ లాంగ్ హెయిర్ తో కనిపిస్తారట. దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ లుక్ ఆ విధంగా డిజైన్ చేశాడట. గతంలో ప్రభాస్ బాహుబలి, బాహుబలి 2 చిత్రాల్లో లాంగ్ హెయిర్ తో కనిపించారు.
అలాగే ఆదిపురుష్ మూవీలో రామునిగా లాంగ్ హెయిర్ లో దర్శనమిచ్చాడు. ఆజానుబాహుడైన ప్రభాస్ కి ఈ లుక్ బాగా సెట్ అవుతుంది. సెంటిమెంట్ పరంగా కూడా కలిసి వస్తుంది. కెరీర్ బిగినింగ్లో మున్నా చిత్రాల్లో కూడా ప్రభాస్ లాంగ్ హెయిర్ ట్రై చేశారు. ఆ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇక ప్రాజెక్ట్ కే 2024 జనవరి 12న విడుదల కానుంది. దీపికా పదుకొనె, దిశా పటాని హీరోయిన్స్ నటిస్తున్నారు. అమితాబ్ కీలక రోల్ చేస్తున్నారు.