Pawan Kalyan Hari Hara Veera Mallu: రాజకీయంగా బిజీ అయిన పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నుండి చాలా గ్యాప్ తర్వాత వస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. జులై 24న వరల్డ్ వైడ్ పలు భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీ చిత్రీకరణ ఏళ్ల తరబడి సాగింది. అలాగే దర్శకుడు క్రిష్ తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు. ఈ కారణంగా సినిమా మీద కొంత నెగిటివ్ ఇంపాక్ట్ పడింది. ఆశించిన స్థాయిలో బజ్ ఏర్పడలేదు. ట్రైలర్ విడుదలతో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇటీవల విడుదలైన హరిహర వీరమల్లు ట్రైలర్ మైండ్ బ్లాక్ చేసింది. అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్స్, విజువల్స్, విఎఫ్ఎక్స్ వర్క్ తో వండర్ క్రియేట్ చేసింది.
Also Read: సుకుమార్ వల్లే అల్లు అర్జున్ స్టార్ అయ్యాడు అంటూ రాఘవేంద్ర రావు వివాదాస్పద వ్యాఖ్యలు!
హరిహర వీరమల్లు(Harihara Veeramallu) ట్రైలర్ విడుదల అనంతరం అంచనాలు పీక్స్ కి చేరాయి. హరిహర వీరమల్లుతో టాలీవుడ్ లో నయా రికార్డ్స్ క్రియేట్ కావడం ఖాయం అంటున్నారు. ఈసారి విడుదల తేదీ మారదు.. రికార్డ్స్ మారుతాయి, అని దర్శకుడు జ్యోతికృష్ణ వేదిక మీద విశ్వాసం వ్యక్తం చేయడం విశేషం. కాగా తెలుగు సినిమాకు నైజాం అతిపెద్ద మార్కెట్ గా ఉంది. మరి నైజాంలో హరిహర వీరమల్లు ఆల్ టైం రికార్డు నమోదు చేయగలదా? అనే చర్చ మొదలైంది.
నైజాంలో టాప్ ఫైవ్ ఫస్ట్ డే ఓపెనింగ్ రికార్డ్స్ పరిశీలిస్తే… పుష్ప 2 అగ్రస్థానంలో ఉంది. అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప 2 ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్ డే నైజాంలో రూ.25.4 కోట్లతో ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది. పుష్ప 2 తర్వాత రెండో స్థానంలో ఆర్ ఆర్ ఆర్ ఉంది. ఎన్టీఆర్-రామ్ చరణ్ ల ఈ మెగా మల్టీస్టారర్ ఫస్ట్ డే రూ.23.30 కోట్లు వసూలు చేసింది. ఎన్టీఆర్-రామ్ చరణ్ సంయుక్తంగా ఈ రికార్డు నెలకొల్పారు.
మూడో స్థానంలో దేవర ఉంది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన తెరకెక్కించిన దేవర ఫస్ట్ డే నైజాం కలెక్షన్స్ రూ.22.6 కోట్లు. నైజాం టాప్ 5 ఫస్ట్ డే వసూళ్ల క్లబ్ లో ఎన్టీఆర్ రెండు స్థానాలు ఆక్రమించాడు. ఇక రూ.20.55 కోట్లతో నాలుగో స్థానంలో సలార్ ఉండగా, రూ.19.6 కోట్లతో ఐదో స్థానంలో కల్కి 2829 AD ఉంది. నైజాం ఓపెనింగ్ డే రికార్డ్స్ లో అల్లు అర్జున్, ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్ సత్తా చాటారు. హరిహర వీరమల్లు ఆల్ టైం రికార్డు కొట్టాలి అంటే.. దాదాపు రూ. 26 కోట్లు ఫస్ట్ డే నైజాంలో రాబట్టాలి. మరి చూద్దాం ఏ మేరకు పవన్ కళ్యాణ్ ఆ రికార్డు అందుకుంటారో.
ఏఎమ్ రత్నం భారీ బడ్జెట్ తో హరిహర వీరమల్లు నిర్మించాడు. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నిధి అగర్వాల్, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బాబీ డియోల్ ప్రధాన విలన్ రోల్ చేస్తున్నాడు. కీరవాణి సంగీతం అందించారు.