Bigg Boss 9 Telugu Wild card entry: మన తెలుగు లో ‘బిగ్ బాస్ 9′(Bigg Boss 9 Telugu) అద్భుతమైన టీఆర్ఫీ రేటింగ్స్ ని సొంతం చేసుకొని ముందుకు దూసుకుపోతుండడం మనమంతా చూస్తూనే ఉన్నాం. ఈ సీజన్ ప్రతీ కంటెస్టెంట్ కూడా ప్రాణం పెట్టి ఆడుతున్నారు, వాళ్ళ ద్వారా ఆడియన్స్ కి బోలెడంత ఎంటర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. తెలుగు బిగ్ బాస్ తో పాటు, ఇతర భాషల్లో కూడా బిగ్ బాస్ షోస్ ప్రస్తుతం సమాంతరంగా నడుస్తున్నాయి. హిందీ లో సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ 19’ మన తెలుగు కంటే ముందే మొదలైంది. త్వరలోనే ఈ హౌస్ లోకి వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ని లోపలకు పంపబోతున్నారు. ఆ కంటెస్టెంట్స్ లో మన ఇండియన్ స్టార్ క్రికెటర్ సోదరి కూడా ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె మరెవరో కాదు ప్రముఖ ఇండియన్ క్రికెటర్ దీపక్ చాహర్(Deepak Chahar) సోదరి మాల్తీ చాహర్(Malthi Chahar).
బాలీవుడ్ లో ఒక మోడల్ గా కెరీర్ ని ప్రారంభించిన ఈమె, ఆ తర్వాత పలు సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపు ని సంపాదించింది కానీ, స్టార్ మాత్రం కాలేకపోయింది. చూసేందుకు హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుంది కానీ, హీరోయిన్ అవకాశాలు మాత్రం రావడం లేదు. అందుకే ఆడియన్స్ కి ఆమె మరింత దగ్గర అవ్వడం కోసం బిగ్ బాస్ షోలో పాల్గొనడానికి సిద్ధమైంది. సినిమాల్లో ఈమె అనుకున్నంత రేంజ్ కి వెళ్లకపోయి ఉండొచ్చేమో కానీ, సోషల్ మీడియా ద్వారా మాత్రం మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించింది. కేవలం తన అన్నయ్య దీపక్ చాహర్ , పెద్ద స్టార్ క్రికెటర్, అతని సోదరి కాబట్టి ఈమెకు కూడా ఫాలోవర్స్ వచ్చారు అనడానికి లేదు. తన సొంత కంటెంట్ క్రియేటింగ్ టాలెంట్ తోనే ఆమె ఇన్ స్టాగ్రామ్ లో దాదాపుగా 10 మిలియన్ ఫాలోవర్స్ ని సంపాదించుకుంది.
చాలా మంది స్టార్ హీరోయిన్స్ కి కూడా ఈ రేంజ్ ఫాలోవర్స్ లేరు అనొచ్చు. ఈమె ఫిల్మోగ్రఫీ ని ఒకసారి చూస్తే 2018 వ సంవత్సరం లో అనిల్ శర్మ దర్శకత్వం వహించిన ‘జీనియస్’ లో ఈమె రుబీనా అనే పాత్ర ద్వారా వెండితెరకు పరిచయం అయ్యింది. ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద హిట్ కాకపోయినప్పటికీ మాల్తీ చాహర్ పాత్రకు మంచి పేరొచ్చింది. ఆ తర్వాత అరవింద్ పాండే దర్శకత్వం లో తెరకెక్కిన రొమాంటిక్ డ్రామా ఇష్క్ పాష్మీనా అనే చిత్రం లో కూడా నటించింది. ఈ సినిమా కూడా ఆమె కెరీర్ కి ఉపయోగపడలేదు. ఇలా కెరీర్ లో పెద్ద రేంజ్ కి వెళ్లడం కోసం తపిస్తున్న మాల్తీ చాహర్ బిగ్ బాస్ ద్వారా తన టార్గెట్ ని చేరుకుంటుందో లేదో చూడాలి.