NTR Dragon: ఈ జనరేషన్ లో ఉన్న స్టార్ హీరోలందరిలో నటన పరంగా చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ ముందు వరుసలో ఉన్నాడు. ఎలాంటి పాత్రనైనా సరే అలవోకగా చేసి మెప్పించగలిగే కెపాసిటి ఆయన సొంతం… అందుకే చాలా మంది దర్శకులు వాళ్ళు రాసుకున్న వైవిధ్యమైన పాత్రలకు ఎన్టీఆర్ నే హీరోగా ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్) సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వీలైనంత తొందరగా ఈ సినిమాని ఫినిష్ చేసి ఈ సంవత్సరం ఎండింగ్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రశాంత్ నీల్ సన్నాహాలు చేస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ కి ఇప్పటివరకు 1000 కోట్ల మార్కెట్ అయితే లేదు. కానీ ఈ సినిమాని దాదాపు 700 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది. తద్వారా జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ పెరిగే అవకాశాలు ఉన్నాయా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
ఇక ఈ సినిమా అవుట్ ఫుట్ మీద ఎన్టీఆర్ చాలా సంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు షూట్ చేసిన సీన్స్ మొత్తం అద్భుతంగా వచ్చాయట. దానివల్ల ఈ సినిమా ఈజీగా 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొడుతుందనే అంచనాలో మేకర్స్ ఉన్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ సైతం చాలా సాటిస్ఫైడ్ గా ఉండడంతో తన అభిమానులు చాలా అంచనాలైతే పెట్టుకున్నారు…
మరి వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాని రూపొందుతుందా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రశాంత్ నీల్ కి ఇండియాలో చాలా మంచి మార్కెట్ ఉంది. వరుసగా కేజీఎఫ్ సిరీస్, సలార్ సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేశాడు. దానివల్ల అతనికి మంచి మార్కెట్ క్రియేట్ అయింది. ఇప్పుడు చేస్తున్న డ్రాగన్ సినిమాతో మరో సక్సెస్ ను సాధించి ఎన్టీఆర్ స్టార్ డమ్ ను పెంచుతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
గత సంవత్సరం ఎన్టీఆర్ చేసిన ‘వార్ 2’ సినిమా డిజాస్టర్ అయింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ ఘోర పరాభవాన్ని మూట గట్టుకోవడమే కాకుండా తన మార్కెట్ ను కూడా చాలా వరకు కోల్పోయాడు. అందుకే డ్రాగన్ సినిమాతో మరోసారి తన సత్తా చూపించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు…