NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్…ఈయన వైవిధ్యమైన సినిమాలను చేయడమే కాకుండా స్టార్ హీరోగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకోవడంలో ఆయన చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ఇక ఇదిలా ఉంటే ఎవరైనా దర్శకుడు సూపర్ సక్సెస్ ని కొడితే వెంటనే తన టీం తో ఆ దర్శకుడిని వాళ్ళింటికి పిలిపించి అతనితో సన్నిహితంగా మాట్లాడి అతనికి భోజనం కూడా పెట్టించి తనతో సినిమా చేసేలా ఎన్టీఆర్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తాడు అంటూ అతనితో రెండు సినిమాలు చేసిన దర్శకుడు అయిన సురేందర్ రెడ్డి చెప్పడం విశేషం… ఆయన చేసిన ‘అతనొక్కడే ‘ సినిమా తర్వాత ఆయన ఏ సినిమా చేద్దామని ఆలోచిస్తున్న క్రమంలో ఎన్టీఆర్ కాంపౌండ్ నుంచి మేనేజర్ వచ్చి సురేందర్ ని తీసుకెళ్లి దాదాపు మూడు రోజులపాటు తమ ఇంట్లోనే ఉంచుకొని ఎన్టీఆర్ తో సినిమా చేయాల్సిందిగా చెప్పి అతన్ని ఒప్పించి వక్కంతం వంశీ దగ్గర ఉన్న కథను కూడా చెప్పి ఈ స్టోరీ తో మనం సినిమా చేస్తున్నామని జూనియర్ ఎన్టీఆర్ సినిమాని పట్టాలెక్కించారట. సురేందర్ రెడ్డి ఆ సినిమాను పూర్తిగా ఓన్ చేసుకోలేక ఆ సినిమాని డిజాస్టర్ చేయాల్సి వచ్చింది అంటూ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ భారీ సక్సెస్ లను అందుకుంటున్న క్రమం లో ఎన్టీయార్ గారే స్వయంగా నాటుకోడి పులుసు చేసుకొని బెంగుళూర్ వెళ్లి మరి ప్రశాంత్ నీల్ కి తినిపించాడు.
అలాగే ప్రస్తుతం ఆయనతో సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఆయనతో కలిసి బెంగళూరులోని దేవాలయాలన్నింటిని తిరిగి వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ ఎవరి దగ్గర సక్సెస్ ఉంటే ఆ దర్శకుడిని ఎలాగైనా సరే తనతో సినిమా చేసే విధంగా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తాడు అంటూ చాలా రకాల కామెంట్లైతే చేస్తున్నారు.
మరి ఇప్పుడు జరుగుతున్న సిచువేషన్ ను బట్టి చూస్తే ఇది నిజమని నమ్మక తప్పడం లేదు. జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరో అలాగే పాన్ ఇండియా లో కూడా భారీ సక్సెస్ ని సాధించగలిగిన హీరో అవ్వడం వల్ల దర్శకులు కూడా అతనితో సినిమా చేయడానికి చాలా వరకు ఆసక్తిని చూపిస్తున్నారు.
మరి మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్లతో మాత్రమే సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.ఇక వీళ్ళు చేస్తున్న సినిమా అయితే భారీ బడ్జెట్ తో తెరకెక్కడమే కాకుండా ఇండస్ట్రీ రికార్డులను కూడా బ్రేక్ చేస్తుందని తను పూర్తి కాన్ఫిడెంట్ గా ఉన్నాడు…