Jr NTR multi-starrer movies: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. గత మూడు తరాలుగా వాళ్ళు ఇండస్ట్రీని శాసిస్తూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఎదగడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా కూడా తన పదవి బాధ్యతలను కొనసాగించి యావత్ తెలుగు ప్రేక్షకులందరికీ దగ్గరయ్యాడు. మరి ఏదిఏమైనా కూడా తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని నిలపడంలో ఆయన తీవ్రమైన కృషి చేశారనే చెప్పాలి… ఇక ఆయన తర్వాత తన నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య బాబు సైతం మంచి సినిమాలను చేస్తూ వస్తున్నాడు. ఇక మూడోవ తరం హీరోగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ మొదట్లో మాస్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినప్పటికి ఇప్పుడు కంటెంట్ బేస్డ్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…ఇక అందులో భాగంగానే బాలీవుడ్ డైరెక్టర్ అయిన అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో చేసిన వార్ 2 సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది. ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. మరి ఇంతకుముందే ఆయన రామ్ చరణ్ తో త్రిబుల్ ఆర్ అనే సినిమాలో కలిసి నటించాడు. అయితే ఆ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకి అంత ప్రాధాన్యత లేదని రామ్ చరణ్ పాత్రనే సినిమా మొత్తానికి హైలైట్ గా నిలిచిందని ప్రతి ఒక్కరు కామెంట్స్ చేయడంతో ఎన్టీఆర్ కొంతవరకు నిరుత్సాహపడ్డాడు. ఇక ఇప్పుడు ‘వార్ 2’ సినిమాలో సైతం ఎన్టీఆర్ విలన్ పాత్రను పోషించినప్పటికి ఆయనకు పెద్దగా గుర్తింపైతే రాలేదు.
మరి ఇలాంటి సందర్భంలో హృతిక్ రోషన్ ను బీట్ చేసి తను మంచి గుర్తింపు సంపాదించుకుంటాడు అని అభిమానులు ఆశపడ్డారు. కానీ అది జరగలేదు సినిమాలో పెద్దగా మ్యాటర్ కూడా లేకపోవడంతో ఎన్టీఆర్ క్యారెక్టర్ అయితే ఎలివేట్ అవ్వలేదు.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్.. పాన్ ఇండియాలో ప్రభాస్.. ఓపెనింగ్ కింగ్స్ ఇక వీళ్లేనా?
దాంతో ఇప్పుడు ఎన్టీఆర్ మల్టీస్టారర్ సినిమాలను చేయకూడదని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ప్రతి దర్శకుడు తనకు కథను చెప్పినప్పుడు తన పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీ చెప్పి తన క్యారెక్టర్ హైలైట్ గా ఉంటుందని చెబుతున్నారు.
కానీ తీరా సెట్స్ మీదకి వచ్చేసరికి తన క్యారెక్టర్ ని డౌన్ చేసి చూపిస్తున్నారనే ఉద్దేశ్యంతోనే ఆయన ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది…మరి ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడు. తద్వారా ఆయనకంటు ఒక ఐడెంటిటి క్రియేట్ అవుతోందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…