https://oktelugu.com/

Allu Family: అల్లు ఫ్యామిలీ మీద నెగిటివిటి పెరుగుతుందా..? మరి అల్లు అరవింద్ ఏం చేస్తున్నాడు…

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నారు. ఇక సినిమాలు చేయడంలో ఒక్కొక్క హీరోకి ఒక్కో స్టైల్ ఉంది...వాళ్ళ స్టైల్ ని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటూ జనాల్లో స్టార్ హీరో స్టేటస్ ని అందుకున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : August 8, 2024 / 10:11 AM IST

    Allu Family

    Follow us on

    Allu Family: సినిమా ఇండస్ట్రీలో ప్రతి హీరో అభిమానులు వాళ్ల హీరో చేసే సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు. ఎందుకంటే ఆ నటుడుని వాళ్లు అభిమానిస్తున్నారు కాబట్టి ఆ హీరో మిగతా హీరోలు కంటే టాప్ లెవెల్ లో ఉండాలని కోరుకుంటుంటారు. ఇక ఇండస్ట్రీలో సక్సెసులు అనేవి చాలా ఎక్కువగా ఉన్నప్పుడే హీరోలు స్టార్ హీరోలుగా మారుతారు. ఇక ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ఆర్య సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ని క్రియేట్ చేసుకున్న నటుడు అల్లు అర్జున్… ఈయన స్టైలిష్ స్టార్ గా మారడమే కాకుండా మెగా ఫ్యామిలీ హీరోగా కూడా గుర్తింపును సంపాదించుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఆయన పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగాడో అప్పటినుంచి చిరంజీవిని పవన్ కళ్యాణ్ ని పట్టించుకోకుండా అసలు మెగా ఫ్యామిలీతో సంబంధం లేకుండా తనకంటూ సపరేట్ గా అల్లు ఫ్యామిలీ ఉందని దానివల్లే తను ఈరోజు ఈ పొజిషన్ లో ఉన్నానని ఒక ఈవెంట్ లో చెప్పడం నిజంగా మెగా అభిమానులను తీవ్రంగా కలిచి వేసింది. అప్పటిదాకా చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల పేర్లు చెప్పుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగిన అల్లు అర్జున్ ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించడంతో మెగా అభిమానులు అందరూ ఆయన మీద తీవ్రమైన కోపంతో ఉన్నారు…

    ఇక దానికి తోడుగా జనసేన పార్టీ ని స్థాపించి ఆ పార్టీ నుంచి బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్ కి ఏ మాత్రం సపోర్ట్ చేయకుండా వైసిపి పార్టీ అభ్యర్థికి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడం వెనక చాలా కుట్ర దాగి ఉందని కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు పసిగట్టారు. ఇక అల్లు ఫ్యామిలీ బాధ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా రానించకూడదు తను కూడా చిరంజీవిలాగే ఫెయిల్యూర్ పొలిటీషియన్ గా మిగిలిపోయి తన పార్టీ ని విరమించుకొని మళ్లీ సినిమాల్లోకి వస్తే జనాల్లో ఆయన ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది.

    తద్వారా పవన్ కళ్యాణ్ తమకంటే ఎక్కువ కాదని ప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశ్యం లో అల్లు అర్జున్ అలాగే వాళ్ళ ఫాదర్ అయిన అల్లు అరవింద్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో విపరీతమైన కథనాలైతే వెలువడుతున్నాయి. ఇక ఇప్పుడు ఆ ఉద్దేశంతోనే అల్లు ఫ్యామిలీ మీద మెగా ఫ్యామిలీ అభిమానులందరూ తీవ్రమైన కోపంతో ఉన్నారు. అందుకే ఆగస్టు 15 కి రావాల్సిన ‘పుష్ప 2 ‘ సినిమా డిసెంబర్ కి పోస్ట్ పోన్ చేశారు. ఇక అల్లు అరవింద్ కూడా తమ బ్యానర్ పైన పెద్ద హీరోలతో సినిమాలు చేయడం లేదు. ఎందుకంటే వాళ్లు కూడా తమకు డేట్స్ సరిగ్గా ఇవ్వడం లేదని చాలా స్పష్టంగా తెలుస్తోంది… ఇక దాంతో పాటుగా రీసెంట్ గా అల్లు శిరీష్ హీరోగా వచ్చిన ‘బడ్డీ ‘ సినిమాని ఏ మెగా ఫ్యాన్ కూడా పట్టించుకోలేదు.

    దానివల్ల అసలు ఆ సినిమా ఎప్పుడు థియేటర్ లోకి వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది… ఇలా అల్లు ఫ్యామిలీ మీద పూర్తిగా నెగిటివిటీ అయితే పెరిగిపోయింది. మరి దాన్ని తగ్గించడానికి అల్లు అరవింద్ ఏదైనా ప్లాన్ వేస్తున్నాడా అంటే ఆయన కూడా కామ్ గానే ఉంటూ ముందుకు సాగుతున్నాడు. మరి వీళ్ళ మీద నెగిటివిటీ తగ్గేది ఎప్పుడు, వీళ్ళ సినిమాలు సూపర్ సక్సెస్ లు అయ్యేది ఎప్పుడో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…