https://oktelugu.com/

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ హౌస్లోకి యంగ్ పొలిటీషియన్… మిగతా కంటెస్టెంట్స్ కి చుక్కలే!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 త్వరలో ప్రారంభం కానుంది. కంటెస్టెంట్స్ ఎంపిక దాదాపు పూర్తి అయ్యింది. కాగా షోని సక్సెస్ చేసేందుకు మేకర్స్ అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నారు. కాగా ఈసారి ఓ యంగ్ పొలిటీషియన్ హౌస్లోకి ప్రవేశిస్తుందట.

Written By:
  • S Reddy
  • , Updated On : August 8, 2024 / 10:06 AM IST

    Bigg Boss 8 Telugu

    Follow us on

    Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ షోకి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిందీలో మొదలైన ఈ షో అన్ని ప్రాంతీయ భాషలకు పాకింది. 2017లో ప్రయోగాత్మకంగా తెలుగులో లాంచ్ చేశారు. ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన సీజన్ 1 గ్రాండ్ సక్సెస్. వెండితెరకు చెందిన టాప్ సెలెబ్స్ మొదటి సీజన్లో పాల్గొనడం విశేషం. శివ బాలాజీ విన్నర్ గా నిలిచాడు. సీజన్ 2కి నాని హోస్ట్ గా వ్యవహరించారు. నాని హోస్ట్ గా పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదని చెప్పాలి.

    ఇక సీజన్ 3 నుండి నాగార్జున రంగంలోకి దిగారు. గత ఐదు సీజన్స్ సక్సెస్ఫుల్ గా నడిపారు. ఇప్పటి వరకు బిగ్ బాస్ తెలుగు ఏడు సీజన్స్ పూర్తి చేసుకుంది. సీజన్ 6 మాత్రమే విఫలం చెందింది. ఆ సీజన్ కి ఆశించిన స్థాయిలో టీఆర్పీ రాలేదు. దాంతో సీజన్ 7 సరికొత్తగా రూపొందించింది గ్రాండ్ సక్సెస్ చేశారు. ఈ క్రమంలో సీజన్ 8 పై అంచనాలు పెరిగాయి. ఇటీవల సీజన్ 8 లోగోతో కూడిన ప్రోమో విడుదల చేశారు.

    అలాగే నాగార్జున, నటుడు సత్యతో కూడిన ప్రోమో సైతం ఆకట్టుకుంది. కాగా కంటెస్టెంట్స్ ఎవరు అనే అంశం ప్రేక్షకులను ఎక్కువగా ఆకర్షిస్తుంది. ఈసారి ఓ యంగ్ పొలిటీషియన్ హౌస్లో అడుగుపెడుతుందట. ఆమె ఎవరో కాదు బర్రెలక్క. ఈమె సీజన్ 8లో పాల్గొంటుందని మొదటి నుండి వినిపిస్తుంది. తాజాగా ఆమెను ఫైనల్ చేశారనే వాదన మొదలైంది.

    బర్రెలక్క సోషల్ మీడియా సెలబ్రిటీ. ఈమె అసలు పేరు కర్నె శిరీష. తెలంగాణకు చెందిన శిరీష డిగ్రీ చదివింది. ఉద్యోగం రాక బర్రెలు కాచుకుంటున్నానని వీడియోలు చేస్తూ ఫేమస్ అయ్యింది. శిరీష కాస్త బర్రెలక్క అయ్యింది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో శిరీష పోటీ చేసింది. ఆమె తరపున జేడీ లక్ష్మి నారాయణ ప్రచారం చేయడం విశేషం.

    బిగ్ బాస్ మేకర్స్ ఆమెను సంప్రదించడంతో పాటు ఎంపిక చేశారట. బిగ్ బాస్ తెలుగు 8లో బర్రెలక్క కనిపించడం ఖాయం అంటున్నారు. ఈ పల్లెటూరి ఫైర్ బ్రాండ్ దెబ్బకు మిగతా కంటెస్టెంట్స్ కి చుక్కలు కనిపిస్తాయి అనడంలో సందేహం లేదు. బర్రెలక్కతో పాటు కుమారి ఆంటీ, నటుడు ఖయ్యూమ్ అలీ, సన, సోనియా సింగ్, మై విలేజ్ షో అనిల్, యాదమ్మరాజు, కిరాక్ ఆర్పీ ఎంపిక అయ్యారట.

    ఈ సారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో ముగ్గురు సీరియల్ నటులు ఉన్నారట. గత సీజన్లో స్టార్ మా సీరియల్స్ లో నటించే అమర్ దీప్ చౌదరి, ప్రియాంక సింగ్, శోభా శెట్టి కంటెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరు సీరియల్ బ్యాచ్ గా పేరు తెచ్చుకున్నారు. కలిసి ఒక జట్టుగా గేమ్ ఆడారు. ఇక బిగ్ బాస్ తెలుగు 8 సెప్టెంబర్ 8న మొదలయ్యే అవకాశం కలదు. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారం అవుతున్న కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సెప్టెంబర్ 1న ముగియనుందట. నెక్స్ట్ సండే నుండి బిగ్ బాస్ షో ప్రసారం అవుతుందట. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుతుంది.