https://oktelugu.com/

Srikanth Odela : శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వస్తున్న సినిమాలో నాని మాస్ హీరోగా కనిపించనున్నాడా..?

 తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నటులు చాలా మంది ఉన్నారు. అందులో నాని ఒకరు. ఈయన ప్రస్తుతం స్టార్ హీరోలకు సైతం పోటీ ఇస్తున్నాడు...

Written By:
  • Gopi
  • , Updated On : September 8, 2024 / 09:37 AM IST

    Srikanth Odela

    Follow us on

    Srikanth Odela : నాచురల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు నాని వరుసగా మూడు విజయాలను అందుకొని మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇక ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరొక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఆయన చేసిన సినిమాలన్నీ కూడా మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో మరోసారి శ్రీకాంత్ ఓదెల మీదనే ఆయన నమ్మకం పెట్టుకొని మరొక మాస్ సినిమాని చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇంతకుముందు వచ్చిన దసర సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా నటుడిగా మంచి గుర్తింపుని తీసుకొచ్చింది. ఇక దర్శకుడి గా శ్రీకాంత్ ఓదెలకు కూడా పలు అవార్డులను కూడా తీసుకొచ్చి పెట్టింది. మరి ఇలాంటి క్రమంలో మరోసారి వీళ్ళ కాంబినేషన్ లో ఒక మాస్ సినిమా రాబోతుంది అంటూ అనౌన్స్ మెంట్ అయితే ఇచ్చారు. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల ఒక భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.

    ఇక ఈ సినిమాతో కనక ఆయన మరోసారి భారీ సక్సెస్ ని అందుకుంటే పెద్ద హీరోల నుంచి కూడా ఆయనకు అవకాశాలు వచ్చే ఛాన్స్ లు అయితే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎలాగైనా సరే ఆయన ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాలనే భారీ అంచనాలను పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన పాన్ ఇండియా డైరెక్టర్ గా కూడా గుర్తింపు తెచ్చుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక నాని లాంటి నటుడు మరోసారి అవకాశం ఇచ్చాడు అంటే శ్రీకాంత్ ఓదెల టాలెంట్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు.

    నిజానికి శ్రీకాంత్ ఓదెల సుకుమార్ దగ్గర డైరెక్షన్ డిపార్టుమెంటు లో వర్క్ చేసినప్పుడు కూడా చాలా యాక్టివ్ గా ఉండేవారట. అందువల్లే అతనికి ఎక్కువ సినిమాలు వర్క్ చేయకుండా తొందరగా డైరెక్టర్ అయ్యే అవకాశాలు కూడా వచ్చాయి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల మరోసారి భారీ సక్సెస్ ను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని సాగుతున్నారు. ఇక తను అనుకున్నట్టుగానే ఆయనకు సక్సెస్ దక్కుతుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ‘సరిపోదా శనివారం’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నాని ఇప్పుడు మంచి ఉత్సాహం మీద ఉన్నాడు.

    ఇక మోత్తానికైతే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో చేసిన రెండో సినిమా మంచి విజయాన్ని సాధించడంతో ఆయన శ్రీకాంత్ ఓదెల మీద కూడా భారీ అంచనాలు పెట్టుకున్నాడు. మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ఉంటుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక నాని చేస్తున్న సినిమాలను చూస్తే ఇక మీదట మాస్ సినిమాలు చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది…