Mass Jatara Movie Postponed: సినిమా ఇండస్ట్రీలో ఏ రోజు ఏం జరుగుతుందో ఎవ్వరు చెప్పలేరు. ఎందుకంటే సూపర్ హిట్ అవుతాయి అనుకున్న సినిమాలు బోల్తా కొట్టొచ్చు. అలాగే ఫ్లాప్ అవుతాయి అనుకున్న సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించవచ్చు…సినిమా రిలీజ్ అయ్యేంతవరకు ఎవరు దీన్ని 100% ఎక్స్పెక్ట్ చేయలేరు. కాబట్టి మనం ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలచినట్టు ఏది జరిగిన ఆశ్చర్యపోనవసరం లేదు… ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగు లో వస్తీసగా సినిమాలు చేస్తూ టాప్ ప్రొడ్యూసర్ గా నాగ వంశీ ప్రస్తుతం వరుసగా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ సినిమాలను మూటగట్టుకుంటున్నాడు. ఇంతకుముందు విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘ కింగ్డమ్’ సినిమా ప్రేక్షకుల్లో ఎలాంటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేయలేకపోయింది. ఫైనల్ గా ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. 100 కోట్లకు పైన ఈ సినిమాకి బడ్జెట్ ను పెడితే దాదాపు 50 కోట్ల వరకు నష్టాలను మిగిల్చింది…ఇక బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ లు హీరోలుగా వచ్చిన ‘వార్ 2’ సినిమాను సైతం భారీ డబ్బులను పెట్టి తెలుగులో రిలీజ్ చేశాడు. ఈ సినిమా సైతం ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఆయనకు దాదాపు 60 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే 100 కోట్లకు పైన నష్టాన్ని చవిచూసిన నాగ వంశీ ఇప్పుడు కొంతవరకు ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక డిస్ట్రిబ్యూటర్స్ సైతం తమకు సెటిల్ చేయాల్సింది సెట్ చేయమని కొంతవరకు ఆయన మీద ప్రెషర్ అయితే పెడుతున్నారట. దాంతో ఈనెల 27వ తేదీన రిలీజ్ అవ్వాల్సిన రవితేజ ‘మాస్ జాతర’ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు అంటూ సినిమా ఇండస్ట్రీలో కొన్ని కథనాలైతే వెలువడుతున్నాయి.
మరి అఫీషియల్ గా నాగవంశీ ఇప్పటివరకు ఈ విషయం మీద ఎలాంటి స్పందన తెలియజేయునప్పటికీ మాస్ జాతర సినిమాను పోస్ట్ పోన్ చేస్తే మాత్రం నాగ వంశీ ఫైనాన్షియల్ గా చాలా స్ట్రగుల్స్ ని ఎదుర్కొంటున్నాడనే విషయమైతే క్లారిటీ వస్తోంది…ఇక దాంతోపాటుగా మాస్ జాతర సినిమాని ఇప్పుడు పోస్ట్ పోన్ చేస్తే ఆ సినిమాని మళ్లీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే దాని మీద సరైన క్లారిటీ అయితే ఇవ్వకపోవచ్చు.
Also Read: డైరెక్టర్ తేజ కొడుకుని ఎప్పుడైనా చూశారా..? మొదటి సినిమాతోనే కుంభస్థలం బద్దలు కొట్టాడుగా!
కారణం ఏంటి అంటే వచ్చే నెలలో ఒక్కో వారం ఒక్కో సినిమా తమ స్లాట్ ని బుక్ చేసుకొని ఉన్నాయి. ముఖ్యంగా సెప్టెంబర్ 25వ తేదీన ఓజీ , అఖండ 2 రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతుండడంతో ఏదో ఒక సినిమాని పోస్ట్ పోన్ చేసే అవకాశాలు ఉన్నాయి. అనుకున్న డేట్ కంటే ఒక వారం ముందు కానీ, లేదంటే తరువాత కానీ రిలీజ్ చేసే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి మాస్ జాతర సినిమాను ఇప్పుడు పోస్టు పోన్ చేస్తే దానికి స్లాట్ దొరకడం చాలా కష్టతరం అవుతోంది.
ఆ సినిమా దసర తర్వాత రిలీజ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఏర్పడవచ్చు. అందుకే నాగవంశీ ఈ సినిమా మీద ఇప్పటివరకైతే కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. కాబట్టి ఈ సినిమాని రిలీజ్ చేసి వచ్చే లాభాలతో నష్టాలను భర్తీ చేయాలని చూస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా రవితేజ ఈ సినిమాలో మరోసారి తన మార్క్ ను చూపించి సక్సెస్ ని సాధించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది…