Bigg Boss 6 Telugu- Rohit and Marina: బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా జనాలకు ఎంటర్టైన్మెంట్ వస్తున్న విషయం వాస్తవమే..కానీ ఈ షో లో పాల్గొంటున్న కంటెస్టెంట్స్ నిజ జీవితాల్లో నిప్పుల కుంపటి పెడుతుంది అనడానికి చాలా ఉదాహరణలే ఉన్నాయి..గత సీసన్ లో ప్రముఖ టాప్ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి మన అందరికి తెలిసిందే..షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత సిరి తో ఎంత క్లోజ్ గా ఉన్నాడో మన అందరికి తెలిసిందే..వీళ్ళ మధ్య ఉన్న సంబంధం చూసి ప్రేక్షకులు కూడా పెదవి విరిచేవారు..ఎందుకంటే సిరి కి నిజ జీవితం లో ఒక ప్రస్తుత బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీహాన్ తో నిశ్చితార్థం కూడా జరిగిపోయింది..ఇక షణ్ముఖ్ జస్వంత్ కి కూడా దీప్తి సునైనా తో లవ్ రిలేషన్ షిప్ ఉంది..త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అనగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు షణ్ముఖ్ జస్వంత్..కానీ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత షణ్ముఖ్ సిరి తో లవ్ ట్రాక్ నడపడం ప్రేక్షకులకు మింగుడు పడనివ్వకుండా చేసింది.

ముఖ్యంగా వాళ్లిదరు మాటికొస్తే కిస్ చేసుకోవడం, హగ్ చేసుకోవడం వంటివి జనాలకు మాత్రమే కాదు..వాళ్ళిద్దరి కుటుంబ సబ్యులకు కూడా చాలా చిరాకు వేసింది..దీప్తి సునైనా అయితే షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి రాగానే బ్రేకప్ చెప్పేసింది..అలా బిగ్ బాస్ హౌస్ వల్ల ఈ జంట విడిపోయింది..ఇప్పుడు మరో జంటపై కూడా బిగ్ బాస్ ప్రభావం పడనుందా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు..ఈసారి బిగ్ బాస్ సీసన్ లోకి మెరీనా – రోహిత్ జంట హౌస్ లోకి అడుగుపెట్టిన సంగతి మన అందరికి తెలిసిందే..హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండే వీళ్లిద్దరి మధ్య ఎదో ఒక గొడవ జరుగుతూనే ఉంది.

చిన్న చిన్న విషయాలకు కూడా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి మాత్రమే కాదు..ఆడియన్స్ కి కూడా చిరాకు పుట్టించేలా వీళ్లిద్దరి మధ్య జరుగుతున్నా వాదనలు చూస్తుంటే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్ళేలోపు వీళ్లిద్దరు విడిపోతారా? అనే సందేహాలు ప్రేక్షకుల్లో మొదలయ్యాయి..ఇప్పటి వరుకు వీళ్లిద్దరి ఒకరి మీద ఒకరు అరుచుకోవడం..మెరీనా ఏడవడం వంటివి తప్ప ఇప్పటి వరుకు సీరియస్ గా గేమ్ ని ఆడింది లేదు..చూడాలి మరి రాబొయ్యే రోజుల్లో అయినా వీళ్లిద్దరు గొడవలు ఆపి గేమ్ మీద ఫోకస్ చేస్తారా లేదా అనేది.