Homeఎంటర్టైన్మెంట్చిరంజీవితో సినిమా చేస్తే కీర్తికి కెరీర్ ఉండదా ?

చిరంజీవితో సినిమా చేస్తే కీర్తికి కెరీర్ ఉండదా ?

Will Keerthy have a career if she does a film with Chiranjeevi
దక్షిణాది స్టార్ హీరోయినాల్లో కీర్తి సురేష్ కూడ ఒకరు. ‘మహానటి’ చిత్రంతో జాతీయ అవార్డు అందుకుందామె. దీంతో ఆమె క్రేజ్ బాగా పెరిగిపోయింది. తెలుగు, తమిళ పరిశ్రమల్లో స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం దక్కింది ఆమె. పవన్ కళ్యాణ్, విక్రమ్, విజయ్ లాంటి బడా హీరోలతో సినిమాలు చేసింది. త్వరలో రజినీకాంత్, మోహన్ లాల్ వంటి వారితో కూడ స్క్రీన్ షేర్ చేసుకోనుంది. అయితే ఆమెకు అడపాడదపా పరాజయాలు ఎదురవుతూనే ఉన్నాయి. అయినా అవకాశాలైతే తగ్గలేదు.

Also Read: బాలయ్య వచ్చేశాడు.. ఇక మిగిలింది మెగాస్టారేనా..!

ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాలు చేస్తున్న ఆమెకు ఇప్పుడు నాలుగో ఆఫర్ కూడ వచ్చింది. అది కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో. మెగాస్టార్ సినిమాలో అవకాశం అంటే ఎవరైనా సంబరపడతారు. కానీ కీర్తి అభిమానులు మాత్రం భయపడుతున్నారు. ఎందుకంటే ఇందులో ఆమె చిరంజీవికి చెల్లెలిగా కనిపించబోతోంది. తమిళ చిత్రం ‘వేదాళం’కు ఇది రీమేక్. ఇందులో ఒక్క చెల్లెలిగా తప్ప ఆమె పాత్రలో వేరే డైవర్షన్స్ ఏమీ ఉండవు.

Also Read: కరోనా నుంచి ఆ అగ్ర హీరో ఎస్కేప్ అయినట్టేనా?

అందుకే అభిమానులు ఆందోళన. ప్రజెంట్ కీరి సురేష్ కెరీర్ బాగానే ఉంది. స్టార్ హీరోయిన్ స్టేటస్ ఉంది. ఇలాంటి తరుణంలో ఎంత మెగాస్టార్ చిరంజీవి సినిమా అయినా చెల్లెలి పాత్రంటే ఆమెకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, కథానాయకిగా ఎన్నో సినిమాలు చేయాల్సిన ఆమె కెరీర్ మీద ఈ సినిమా ఎఫెక్ట్ చూపుతుందని, ఒక్కసారి చెల్లెలిగా చేస్తే మిగతా స్టార్ హీరోలు తమ సినిమాల్లో ఆమెకు కథానాయకిగా తీసుకుంటారా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version