Kalyan Ram: దేవర సినిమాతో కళ్యాణ్ రామ్ కి ఉన్న అప్పులు మొత్తం తీరిపోతాయా..?

ఒక సినిమా సక్సెస్ అయితే ఆ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికి మంచి గుర్తింపు వస్తుంది. అలాగే ఆ సినిమా ప్రొడ్యూసర్ మరిన్ని సినిమాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది...

Written By: Gopi, Updated On : September 17, 2024 11:24 am

Kalyan Ram

Follow us on

Kalyan Ram: దేవర సినిమా మీద ప్రేక్షకులకు విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక కొరటాల శివ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ విషయంలో ప్రతి ఒక్కరు తమదైన రీతిలో సినిమా చూడడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమా కోసం ఇప్పటికే చాలామంది జనాలు ఆసక్తిగా ఎదురు చూడడమే కాకుండా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని భారీ నమ్మకాన్ని కూడా పెట్టుకున్నారు. ఇక ఎన్టీఆర్ అభిమానులైతే ఈనెల 27వ తేదీ కోసం చాలా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకుల్లో ఆనందాన్ని నింపుతుందా? లేదంటే ఎన్టీఆర్ అభిమానులు నిరుత్సాహపడేలా చేస్తుందా? అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు…ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఫిలింనగర్ సర్కిల్లో ఒక వార్త అయితే చాలా ఎక్కువగా వినిపిస్తుంది. అది ఏంటి అంటే దేవర సినిమాకి కళ్యాణ్ రామ్ కూడా ఒక ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకొని ఇంతకుముందు తనకున్న అప్పులను తీర్చుకుంటారా? లేదా అనే కోణంలో కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. నిజానికి కళ్యాణ్ రామ్ ఇంతకుముందు చేసిన కొన్ని సినిమాలు ఫ్లాపులుగా మిగిలాయి. ఆ సినిమాల ద్వారా ఆయన కొంతవరకు నష్టపోయారనే విషయం మనకు తెలిసిందే. అయితే ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి ఈ సినిమాను భారీ రేంజ్ లో నిర్మిస్తున్నారు.

మరి ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించి ఆయనకు అనుకున్న లాభాలను తెచ్చి పెడుతుందా? తద్వారా తన అప్పులు మొత్తం తీర్చుకోగలుగుతాడా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది. నిజానికి ఈ సినిమాను ‘యువ సుధా ఆర్ట్స్’ బ్యానర్ మీద ‘సుధాకర్ మిక్కిలినేని’, ‘కొసరాజు హరికృష్ణ’ ఇద్దరూ నిర్మించాల్సింది. కానీ తన అన్నకి కూడా ఈ సినిమా ద్వారా కొంత ప్రాఫిట్స్ ని అందించాలనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్ ‘నందమూరి ఆర్ట్స్’ బ్యానర్ ని కూడా ఇందులో చేర్చి కళ్యాణ్ రామ్ ను కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా మార్చాడు.

మరి ఇప్పుడు ఈ సినిమా అందించే సక్సెస్ తో కళ్యాణ్ రామ్ భారీ సక్సెస్ ను అందుకొని ప్రాఫిట్స్ ను వెనుకేసుకుంటాడా? తద్వారా తన అప్పులను తీర్చుకోని మిగిలిన డబ్బుతో మరిన్ని సినిమాలను ప్రొడ్యూస్ చేసేంత కెపాసిటీని సంపాదిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది.

ఇక మొత్తానికైతే ఈ సినిమా మీద సోషల్ మీడియాలో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని కొందరు అంటుంటే మరి కొంతమంది మాత్రం ఈ సినిమా మీద పెద్దగా ఆసక్తి చూపించడం లేదంటూ వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేయడం ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది…