https://oktelugu.com/

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కి హరీష్ శంకర్ మరో బ్లాక్ బస్టర్ ఇస్తాడా..?

హరీష్ శంకర్ ఒకడు. ఈయన పవన్ కళ్యాణ్ ను తన అభిమానులు ఎలాగైతే చూడాలి అనుకుంటున్నారో గబ్బర్ సింగ్ సినిమాతో అలా చూపించి ఆ సినిమాను సూపర్ డూపర్ సక్సెస్ చేశాడు.

Written By:
  • Gopi
  • , Updated On : March 20, 2024 / 10:25 AM IST

    Harish Shankar give another blockbuster to Pawan Kalyan

    Follow us on

    Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి చాలా మంచి క్రేజ్ ఉంది. ఆయన చేసిన సినిమాలు సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపునైతే సంపాదించుకున్నాడు. ఇక ఇలాంటి సమయంలోనే ఆయన చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తన పంజా ను విసురుతూ ఉంటాయి. ఇక పవన్ కళ్యాణ్ చరిష్మాని పూర్తిగా వాడుకున్న డైరెక్టర్లు మాత్రం ఇండస్ట్రీ లో చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు.

    వాళ్లలో హరీష్ శంకర్ ఒకడు. ఈయన పవన్ కళ్యాణ్ ను తన అభిమానులు ఎలాగైతే చూడాలి అనుకుంటున్నారో గబ్బర్ సింగ్ సినిమాతో అలా చూపించి ఆ సినిమాను సూపర్ డూపర్ సక్సెస్ చేశాడు. ఇక ఇప్పుడు మరోసారి ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ సినిమాతో ఆ కాంబినేషన్ రిపీట్ అయింది. కాబట్టి ఈ సినిమాతో కూడా మరోసారి భారీ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా గ్లిమ్స్ అయితే ఎక్స్ ట్రా ఆర్డినరీగా ఉందనే చెప్పాలి. ఇక అందులో పొలిటికల్ కు సంబంధించిన డైలాగులను కూడా పెట్టి ప్రేక్షకులకు అలాగే జనసేన పార్టీ కార్యకర్తలకు కూడా మంచి ఊపును తెచ్చారు.

    ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మరోసారి తన స్టార్ డమ్ ఏంటో ప్రూవ్ చేసుకోవాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎలక్షన్ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ అవి ముగిసిన వెంటనే సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తుంది. ముందుగా ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ లను ఫినిష్ చేసి ఆ తర్వాత మిగిలిన సినిమా షూటింగ్ ల మీదికి వెళ్ళబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక నిన్న వచ్చిన గ్లిమ్స్ తో ఈ సినిమా ఎలా ఉండబోతుందో మరోసారి ప్రేక్షకులకు తెలియజేశాడు.

    ఇక ఈ సినిమా కోసమే ప్రతి ఒక్క అభిమాని వేయి కన్నులతో ఎదురుచూస్తున్నారు అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక సెప్టెంబర్ 27వ తేదీన ఓజి సినిమా వస్తుందని అనౌన్స్ చేశారు. ఆ సినిమా వచ్చిన వెంటనే ఈ సినిమాని కూడా దింపబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ ఇయర్ లో పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది…