Tollywood vs Jagan: టాలీవుడ్ సినిమా టిక్కెట్ ధరల వివాదం ఇప్పుడు ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఇప్పటికే హీరో నాని, ఆర్. నారాయణ మూర్తి తదితర సినీ ప్రముఖులు ఏపీ ప్రభుత్వం తీరును తప్పుపట్టారు. ఇక పలువురు పెద్ద సినిమాల నిర్మాతలు దీనిపై గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ వివాదం పెద్దది కాకముందే తెలుగు సినీ నిర్మాతల బృందం రంగంలోకి దిగింది. నిన్న దిల్ రాజు ‘సీఎం జగన్ అపాయింట్ మెంట్ ఇస్తే వెళ్లి కలుస్తానని’ చెప్పుకొచ్చాడు.
ఈ క్రమంలోనే మంగళవారం అమరావతిలో సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని తెలుగు సినీ నిర్మాతల బృందం కలువనుంది. ఏపీ ప్రభుత్వ టిక్కెట్ ధరల సమస్య, ఆన్ లైన్ లో సినిమా టిక్కెట్ల విక్రయంపై నిర్మాతలు కీలక చర్చలు జరుపున్నారు.
Also Read: CM Jagan: కళాకారుల ప్రతీకారం అధికారానికే ముప్పు.. జగన్ ఆలోచించు !
ఇక థియేటర్ల కేటగిరిని బట్టి టికెట్ ధరను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రదర్శించాల్సిన షోల సంఖ్యను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. బెనిఫిట్ షోలు , ధరలపై ఆంక్షలు విధించింది.బెనిఫిట్ షోల పేరుతో కొన్ని థియేటర్లు సినీ ప్రియుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్న మాట వాస్తవం. రోజుకు నాలుగు షోలకు అనుమతి ఉన్నప్పటికీ బెనిఫిట్ షో పేరుతో థియేటర్లలో ఒకటి లేదా రెండు అదనపు షోలు వేశారు. ఈ అదనపు షోలు, వసూలు చేసిన ధర నేరుగా థియేటర్ యజమానులు, పంపిణీ దారులు, నిర్మాతలు, హీరోల జేబుల్లోకి వెళుతుంది. పన్నుల రూపంలో ప్రభుత్వం భారీగా నష్టపోతోంది.
ఈ అంశాలన్నింటిని దృష్టిలో ఉంచుకొని టికెట్ ధర, షోల సంఖ్యను క్రమబద్దీకరించడానికి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నాయి. ఇప్పుడు చర్చలు జరిపి ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చూడడానికి నిర్మాతల ప్రతినిధి బృందం అమరావతికి వస్తోంది. మరి ఏం జరుగుతుందనేది వేచిచూడాలి.
Also Read: CM Jagan on PRC: పీఆర్సీపై జగన్ కీలక భేటీ.. ఉద్యోగుల డిమాండ్లు నెరవేరేనా?